తెలంగాణ

పోలీస్ అకాడమీని సందర్శించిన దలైలామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 11: బౌద్ధమత గురువు దలైలామా శనివారం సర్దార్ వల్లబ్‌భాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీని సందర్శించారు. పోలీస్ అకాడమీ డైరెక్టర్ అరుణ ఎం బహుగుణ దలైలామాను సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా దలైలామా పోలీస్ అకాడమీ సిబ్బంది, కుటుంబీకులతో ముచ్చటించారు. అకాడమీలో అమర జవాన్ల స్మారక స్థూపం వద్ద ఆయన అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా అకాడమీలో శిక్షణ పొందుతున్న 139 మంది ప్రొబేషనరీ ఐపిఎస్‌లతో పాటు భూటాన్, మాల్దీవులు, నేపాల్‌కు చెందిన 15 మంది శిక్షకులనుద్దేశించి ప్రసంగించారు. సర్దార్ వల్లబ్‌భాయ్ పటేల్ దేశ భద్రతకు ఏర్పాటు చేసిన పోలీస్ అకాడమీలో ఎంతో శిక్షణ పొందుతున్నారని, దేశ రక్షణలో ఐపిఎస్‌ల పాత్ర ప్రాముఖ్యతను సంతరించుకుందన్నారు. అహింసా, కరుణ సిద్ధాంతాలతో అభివృద్ధి చెందుతున్న భారత్ ప్రపంచ దేశాలలో ఖ్యాతి గడిస్తోందన్నారు. ఈ సందర్భంగా ట్రైనీ ఐపిఎస్ అధికారులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. దలైలామాకు పోలీస్ అకాడమీ డైరెక్టర్ అరుణ బహుగుణ జ్ఞాపికను బహూకరించారు.

చిత్రం..దలైలామాకు జ్ఞాపికను బహూకరిస్తున్న పోలీస్ అకాడమీ డైరెక్టర్ అరుణ బహుగుణ