తెలంగాణ

కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.7,400 కోట్ల రుణాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 11: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు పది జాతీయ బ్యాంకులు రూ.7,400 కోట్ల రుణాలను మంజూరు చేశాయి. కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్‌కు ఈ రుణాలను సమకూర్చారు. వీటిలో ఆంధ్రా బ్యాంకు రూ.1,300 కోట్లు మంజూరు చేయగా, కెనరా బ్యాంకు రూ.1,000 కోట్లు, కార్పోరేషన్ బ్యాంకు రూ. 1,000 కోట్లు, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ రూ. 1,000 కోట్లు, ఇండియన్ బ్యాంకు రూ. 750 కోట్లు, విజయా బ్యాంకు రూ. 600 కోట్లు, దేనా బ్యాంకు రూ. 660 కోట్లు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ 350 కోట్లు, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 240 కోట్లు చొప్పున మంజూరు చేశాయి. 2020 జూన్ నుంచి 2032 వరకు 12 సంవత్సరాల పాటు 48 త్రైమాసిక వాయిదాల్లో ఈ రుణాలను చెల్లించనున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు మార్జిన్‌మనీగా రూ.1850 కోట్లను సమకూర్చింది. రాష్ట్రప్రభుత్వం మార్జిన్ మనీని ఇచ్చిన వెంటనే బ్యాంకులు కూడా దఫదఫాలుగా రుణాలను విడుదుల

చేస్తాయి. మేడిగడ్డ బ్యారేజి నుంచి ఎల్లంపల్లి బ్యారేజి వరకు జరిగే పనుల కోసం ఈ నిధులను వెచ్చిస్తారు. ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ. 17500 కోట్లని అంచనా వేశారు.