తెలంగాణ

జాతీయ సైనిక కళాశాలకు తెలంగాణ విద్యార్థి ఎంపిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 11: దేశంలో ఎంతో ప్రసిద్ధి చెందిన జాతీయ సైనిక కళాశాల (ఆర్‌ఐఎంసి)కి తెలంగాణ విద్యార్థి సిహెచ్.అవినాష్ ఎంపికయ్యా రు. రక్షణ రంగంలో చేరి దేశానికి సేవలు అందించాలనుకునే వారికి విద్యార్థి దశలోనే బలమైన పునాది వేసే ఈ కళా శాలలో ప్రవేశాలకు జాతీయ స్థాయి లో ప్రవేశపరీక్ష నిర్వహిస్తారు. హైదరా బాద్‌లో 8వ తరగతి చదువుతు న్న అవినాష్ అఖిల భారత స్థాయి లిఖిత పరీక్షలోనూ, పబ్లిక్ సర్వీసు కమిషన్ నిర్వహించిన వౌఖిక పరీక్షలోనూ, ఆరోగ్యపరీక్షల్లోనూ విజయం సాధిం చడంతో ఆర్‌ఐఎంసిలో అవకాశం దక్కింది. ఆర్‌ఐఎంసి నుండి శిక్షణ పొం దిన వారు నేరుగా సైన్యంలో అధికా రి హోదాలో అవకాశాలు పొందుతారు. ఆర్‌ఐఎంసిలో 8వ తరగతిలో చేర్చుకుని వారికి ప్రత్యేక సాయుధ శిక్షణ ఇచ్చిన తర్వాత ఇంటర్మీడియట్ వరకూ అక్కడే చదువు కొనసాగుతుంది, అనంతరం వారికి జాతీయ డిఫెన్స్ అకాడమీలో అవకాశం ఇస్తారు. అక్కడ చదువు పూర్తయి వివిధ శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొన్న తర్వాత సైన్యంలో చేర్చుకుం టారు. అవినాష్ తండ్రి సిహెచ్ శ్రీనివాసరావు రాష్ట్ర హోం మంత్రి నాయని నర్సింహారెడ్డి వద్ద ప్రజాసం బంధాల అధికారిగా పనిచేస్తున్నారు.