తెలంగాణ

స్వచ్ఛత యాప్ డౌన్‌లోడ్‌లో వరంగల్‌కు మొదటిస్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, ఫిబ్రవరి 11: స్వచ్ఛ సర్వేక్షణ్-2017 సర్వేలో భాగంగా సిటిజన్ ఫీడ్‌బ్యాక్ కేటగిరిలో గ్రేటర్ వరంగల్ నగరం దేశవ్యాప్తంగా తన సత్తా చాటుతోంది. మొదటి పదిస్థానాల్లో తన స్థానాన్ని నిలబెట్టుకునే దిశగా ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే స్వచ్ఛత యాప్‌లో దేశవ్యాప్తంగా పాల్గొన్న 500 నగరాలలో వరంగల్ 42వ స్థానంలో నిలచింది. రాష్టస్థ్రాయిలో స్వచ్ఛత యాప్ డౌన్‌లోడ్‌లో శనివారం నాటికి వరంగల్ నగరపాలక సంస్థ అగ్రస్థానంలో నిలచింది. ఈ కేటగిరిలో రాష్ట్ర రాజధాని రెండవ ర్యాంకులో ఉంది. రాష్ట్రంలో వరంగల్, హైదరాబాద్ తరువాత సూర్యాపేట, ఆదిలాబాద్, కరీంనగర్ మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నాయి. స్వచ్ఛతా యాప్‌కు సంబంధించి అన్ని ఉప కేటగిరిలో గ్రేటర్ వరంగల్ ఆధిక్యంలో ఉంది. అసాధారణ పరిస్థితుల్లో తప్ప సిటిజన్ ఫీడ్ బ్యాక్ కేటగిరిలో స్వచ్ఛతా యాప్ డౌన్‌లోడ్‌లో రాష్టస్థ్రాయిలో వరంగల్‌కే అగ్రస్థానం దక్కుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. సిటిజన్ ఫీడ్ బ్యాక్ కేటగిరిలో ఉన్న రెండు అంశాలలో టోల్‌ఫ్రీ నెంబరు 1969 అతి ముఖ్యమైనది. ఈ టోల్ ఫ్రీ నెంబరు విభాగంలో దేశావ్యాప్తంగా గ్రేటర్ వరంగల్ ఫీడ్ బ్యాక్‌కు కేటాయించిన మొత్తం 600మార్కులలో 450 మార్కులను సాధించి జాతీయ స్థాయిలో ఆరవ స్థానంలో నిలచింది. 52681 ఫీడ్‌బ్యాక్‌లతో విశాఖ నగరపాలక సంస్థ ప్రథమ స్థానంలో ఉండగా, 52322 స్పందనలతో గ్వాలియర్ రెండవస్థానంలో నిలచింది. 38540 ఫీడ్‌బ్యాక్‌లతో ఇండోర్, 35156 ఫీడ్‌బ్యాక్‌లతో మైసూరు, 34874 ఫీడ్‌బ్యాక్‌లతో గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక సంస్థలు మూడు, నాలుగు, ఐదవ స్థానాల్లో కొనసాగుతున్నాయి. 29502 స్పందనలతో వరంగల్ ఆరవ స్థానంలో ఉంది. 1969 టోల్‌ఫ్రీ నెంబరుకు ప్రజల నుంచి భారీగా స్పందన లభించింది. ప్రజల నుంచి ఇదేవిధంగా సహకారం కొనసాగితే స్వచ్ఛ సర్వేక్షణ్-2017లో మొదటి పదిస్థానాల్లో గ్రేటర్ వరంగల్‌కు స్థానం ఖాయమనే అభిప్రాయాన్ని నగరపాలక సంస్థ అధికారులు వ్యక్తం చేస్తున్నారు.