తెలంగాణ

పార్లమెంటులో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 12: పార్లమెంటులో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని భారత జాతీయ మహిళా సమాఖ్య జాతీయ నాయకురాలు అరుట్ల సుశీలాదేవి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహిళలకు రిజర్వేషన్లు కల్పించే ఉద్దేశం కేంద్ర ప్రభుత్వానికి లేదన్నట్లు వ్యవహరిస్తోందని అన్నారు. ఆదివారం నాడిక్కడ ఎఐటియుసి కేంద్ర కార్యాలయం వద్ద జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. మహిళలపై వరకట్న వేధింపులు, భౌతిక దాడులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సమాఖ్య తెలంగాణ విభాగం ఉపాధ్యక్షురాలు ఎస్.చాయాదేవి మాట్లాడుతూ మహిళా సంక్షేమం గురించి తెలంగాణ ప్రభుత్వం చేసిన వాగ్దానాలను అమలు చేయలేదని అన్నారు. నిలోఫర్ ఆసుపత్రిలో గర్భిణుల మరణాలకు తెలంగాణ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నిలోఫర్ ఘటనలో ప్రభుత్వ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని అన్నారు. దేశ వ్యాప్తంగా తమ పాపులారిటీని పెంచుకోవడానికే మహిళా పార్లమెంటు సదస్సును నిర్వహిస్తున్నారు తప్ప దీని వల్ల ఒరిగిందేమీ లేదని అన్నారు. ఐకమత్యంతోనే మహిళల హక్కులను కాపాడుకోవాలని చాయాదేవి పిలుపునిచ్చారు. తెలంగాణ శ్రామిక మహిళా ఫోరం నాయకురాలు కరుణకుమారి, మహిళా సమాఖ్య నగర నాయకురాలు శోభారాణి, రాధిక సహన అంజుం, నాగలక్ష్మి, అమీన తదితరులు పాల్గొన్నారు.