తెలంగాణ

మోటారు వాహన చట్ట సవరణకు నో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 12: కేంద్రప్రభుత్వం ప్రతిపాదించిన మోటారు వాహనాల చట్ట సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని అఖిల భారత రోడ్డు రవాణా వర్కర్స్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర విభాగం డిమాండ్ చేసింది. ఇందుకు తెలంగాణకు చెందిన పార్లమెంటు సభ్యులంతా బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని కోరారు. ఆదివారం నాడిక్కడ ఇందిరాపార్కు వద్ద ఫెడరేషన్ ఆధ్వర్యంలో రోడ్డు రవాణా రంగ కార్మికుల రాష్ట్ర సదస్సు జరిగింది. ఈ సదస్సులో పాల్గొన్న సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.సాయిబాబు మాట్లాడుతూ 2016 డిసెంబర్ 15న నూతన టాక్సీ పాలసీని కేంద్రం విడుదల చేసి ఓలా, ఉబర్ వంటి సంస్థల ఒత్తిడికి తలొగ్గిందని అన్నారు. రవాణా రంగాన్ని బహుళజాతి, కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పడానికే ఈ పాలసీని విడుదల చేసిందని సాయిబాబు విమర్శించారు. నూతన టాక్సీ పాలసీని తెలంగాణ ప్రభుత్వం ఆమోదించకూడదని, వివిగిరి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ సిఫార్సులు అమలు చేయాలని, రవాణా రంగ కార్మికులకు సమగ్ర సామాజిక పథకాలను అమలు చేయాలని కోరారు.