తెలంగాణ

ప్రకంపనలు సృష్టిస్తున్న జీవో111

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 12: హైదరాబాద్ పరిసరాలు, జలాశయాల పరిరక్షణకు మూడు దశాబ్దాల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జారీ చేసిన 111 జీవో భవిష్యత్తుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ జీవోను ప్రభుత్వం సడలిస్తే పర్యావరణ విధ్వంసం జరుగుతుందని మానవ హక్కుల పరిరక్షణ సంఘాలు వాదిస్తుంటే, మరో వైపు అక్రమ నిర్మాణాలు చేపట్టిన ప్రజలు మాత్రం జీవోలోని నిబంధనలు గుదిబండలా తయారయ్యాయంటున్నారు. ప్రస్తుతం కృష్ణా, గోదావరి జలాలు హైదరాబాద్ మంచినీటి అవసరాలు తీరుస్తుంటే, ఉస్మాన్, హిమాయత్‌సాగర్ జలాశయాల పరిధిలో 111 జీవోలో నిబంధనలను సడలించాలనే వారున్నారు. ప్రస్తుతం 111 జీవోను రద్దు చేయడం కుదరదంటూ చెన్నైలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో నిరుడు పిటిషన్ దాఖలైంది. ఈ జీవో అమలు వల్ల ఎదురయ్యే సమస్యలు ఇతర అంశాలపై సమగ్రంగా విచారించి నివేదిక ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం ట్రిబ్యునల్‌కు తెలిపింది. దీనికి అనుగుణంగా ముగ్గురు సీనియర్ ఐఎఎస్ అధికారులతో కమిటీని నియమించింది. ఈ కమిటీ మార్చి 1వ తేదీన ట్రిబ్యునల్‌ను నివేదిక ఇవ్వనుంది. కాగా 111 జీవో పరిధిలో రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలన్న మానవ హక్కుల పరిరక్షణ సంఘాలు దాఖలు చేసిన పిటిషన్‌పై ట్రిబ్యునల్ త్వరలో తన నిర్ణయాన్ని వెలువరించే అవకాశం ఉంది.
జీవో 111 పరిధిలో వికారాబాద్ నుంచి హైదరాబాద్ శివార్లలో ఉన్న ఉస్మాన్ సాగర్, హిమాయత్‌సాగర్ జలాశయాలు ఉన్నాయి. ఉస్మాన్ సాగర్ 42 చ.కిమీ విస్తీర్ణంలో, హిమాయత్ సాగర్ 32.6 చ.కిమీ విస్తీర్ణంలో విస్తరించి ఉన్నాయి. ఇందులో ఉస్మాన్‌సాగర్ పరీవాహక ప్రాంతం 738 చ.కిమీ, హిమాయత్ సాగర్ పరీవాహక ప్రాంతం 1300 చ.కి.మీ ఉంది. ఈ రెండు జలాశయాల నుంచి పది చ.కి.మీ విస్తీర్ణంలో భూములను ప్లాట్లు చేసి విక్రయించరాదు. ఇండ్లు, పరిశ్రమలు, హోటళ్లను నిర్మించరాదు. దీంతో అత్యంత ఖరీదైన, విలువైన భూములన్నీ 111 జీవో పరిధిలో ఉన్నాయి. శంషాబాద్, మొయినాబాద్, షాబాద్, శంకరపల్లి, రాజేంద్రనగర్, చేవెళ్ల మండలాల్లోని కొన్ని ప్రాంతాలు 111 జీవో పరిధిలోకి వస్తాయి.
జీవోకు తూట్లు పొడిస్తే పర్యావరణ విధ్వంసం తప్పదని మానవ హక్కులు, వినియోగదారుల పరిరక్షణ విభాగం చైర్మన్ ఠాకూర్ రాజ్‌కుమార్ సింగ్ చెప్పారు. ఈ ప్రాంతంలో ప్లాట్ల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో దాఖలు చేసిన పిటిషన్‌పై త్వరలో విచారణ జరగుతుందన్నారు. 111 జీవోను రద్దు చేయరాదని తమ సంస్థ పిటిషన్ దాఖలు చేసిందన్నారు.
ప్రస్తుత పరిస్థితి
111 జీవో అమలులో ఉన్నా, నిషేధిత ప్రాంతంలో మొత్తం 12,442 నిర్మాణాలు అక్రమంగా వచ్చాయి. వీటిని ప్రభుత్వం రికార్డు చేసింది. ఇందులో నివాస యోగ్యమైనవి 10907 , కమర్షియలల్ 1350, పారిశ్రామిక యూనిట్లు 99, ప్రభుత్వ సంస్థలకు చెందినవి 86 ఉన్నాయి. ఈ జీవో ప్రకారం రెండు జలాశయాల నుంచి పది కి.మీ రేడియస్‌లోని ప్రాంతాన్ని వ్యవసాయానికి మాత్రమే ఉపయోగించాలి. తొలుత 1989లో రెండుజలాశయాల్లోకి నీటిని నిరోధించే విధంగా నిర్మాణాలు చేపట్టరాదని జీవో 50ను ప్రభుత్వం విడుదల చేసింది. ఆ తర్వాత 1994లో జీవో 192ను అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసింది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 2016 డిసెంబర్ 7వ తేదీన జీవో 839ని టిఆర్‌ఎస్ ప్రభుత్వం విడుదల చేసింది.
నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ పలు మలుపులు తిరుగుతోంది. ప్రస్తుతం అక్రమ నిర్మాణాలు దాని పర్యావసానాలపై సీనియర్ ఐఎఎస్‌లు ప్రస్తుత ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్, ఐఎఎస్ అధికారులు దానకిషోర్, ఎస్‌కె జోషిలతో కూడిన కమిటీ అధ్యయనం చేసి నివేదికను ట్రిబ్యునల్‌కు ఇవ్వాల్సి ఉంది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వద్ద ఈ నెల 10వ తేదీన ఈ కేసు విచారణకు రాగా, మరింత గడువు కావాలని ప్రభుత్వం కోరగా మార్చి 1వ తేదీకి వాయిదా వేశారు.
ఆ లోగా నివేదికను ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ జీవోను ప్రభుత్వం నీరుకార్చకుండా అమలు చేయాలని, అందుకే న్యాయపోరాటం చేస్తున్నామని మానవ హక్కుల సంఘం చైర్మన్ రాజ్‌కుమార్ సింగ్ తెలిపారు. రెవెన్యూ శాఖ గతంలో ట్రిబ్యునల్ ఆదేశం మేరకు కౌంటర్ దాఖలు చేశారు.