తెలంగాణ

పొలాలకు నీరందాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 12: ‘ప్రాజెక్టుల నిర్మాణం పేరిట కాంట్రాక్టర్లు, కొంత మంది రాజకీయ నాయకులు జేబులు నిండడం కాదు నీటితో రైతుల పొలాలు నిండాలి..’ అని బిజెపి జాతీయ నాయకుడు, కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. గోదావరి నీటి సద్వినియోగంతోనే బంగారు తెలంగాణ సాధ్యమని ఆయన తెలిపారు. గోదావరి నదీ జలాల సమగ్ర వినియోగం శీర్షికతో వెదిరె శ్రీరాం రచించిన పుస్తకాన్ని కేంద్ర మంత్రి దత్తాత్రేయ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ప్రసంగిస్తూ గోదావరి నదీ జలాల సమగ్ర వినియోగానికి పుస్తకాన్ని రచించిన వెదిరె శ్రీరాంను అభినందించారు. గోదావరి నదీ జలాల సద్వినియోగానికి అనేక ప్రాజెక్టులు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం కూడా వెదిరె శ్రీరాం సలహాలు, సూచనలు తీసుకోవాలని ఆయన సూచించారు. వాటర్‌షెడ్, భూగర్భ, వాటర్ రిసోర్స్‌ల మధ్య, వ్యవసాయం-ఉద్యానవన వంటి తదితర శాఖల మధ్య సమన్వయం అవసరమని శ్రీరామ్ సూచించారని ఆయన తెలిపారు. సాగు నీరుకు ప్రభుత్వాలు పెద్ద పీట వేయాలన్నారు. అవసరమైతే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని అన్నారు.
3500 టిఎంసిల గోదావరి నీరు వృథాగా సముద్రంలో కలుస్తున్నదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కాళేశ్వరం తెలంగాణకు జీవ నది అని అన్నారు.
విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎల్. నర్సింహారెడ్డి ప్రసంగిస్తూ గోదావరి నదీ జలాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. పంట పొలాలు, గ్రామాల ముంపు లేకుండా ఏ విధంగా ప్రాజెక్టు డిజైన్ చేయవచ్చో వెదిరె శ్రీరామ్ చక్కగా చెప్పారని అన్నారు. బిజెపి శాసనసభాపక్షం నాయకుడు జి. కిషన్ రెడ్డి రచయితను అభినందించారు. పుస్తక రచయిత వెదిరె శ్రీరామ్ పవర్ ప్రజెంటేషన్ ఇస్తూ నదుల అనుసంధానం అవశ్యకత గురించి వివరించారు. రచయిత, గాయకుడు అందెశ్రీ మాట్లాడుతూ వెదిరె శ్రీరామ్‌ను అపర భగీరథుడని ప్రశంసించారు. సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె. రామచంద్ర మూర్తి ప్రసంగిస్తూ 1998 నుంచి ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా మూడున్నర లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు.