తెలంగాణ

ఉచిత వైఫై గ్రామంగా ఇబ్రహీంపూర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట రూరల్, ఫిబ్రవరి 12: ఉచిత వైఫై గ్రామంగా ఇబ్రహీంపూర్‌ను తీర్చిదిద్దినట్లు తెలంగాణ నీటి పారుదలశాఖమంత్రి హరీశ్‌రావు అన్నారు. మండలంలోని ఇబ్రహీంపూర్‌లో ఆదివారం సాయంత్రం పంచాయతీ భవనం, అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మొదటిసారిగా ఉచిత వైఫై గ్రామంగా ఇబ్రహీంపూర్‌లో సేవలందిస్తున్నట్లు తెలిపారు. వైఫైతో గ్రామంలో యువతకు అధునాతన టెక్నాలజీ అందిస్తున్నామన్నారు. క్యాష్‌లెస్‌లో దేశానికే ఆదర్శంగా నిలిచిందని, ఇదే స్ఫూర్తితో నియోజకవర్గంలో మరిన్ని గ్రామాలు క్యాష్‌లెస్‌గా ఎంపికైనాయన్నారు. గ్రామంలో అందరూ ఐక్యంగా ఆదర్శంగా నిలిచారని, ప్రతి ఒక్కరు మార్పుదిశగా అడుగులు వేయాలన్నారు. పారిశుధ్యంతో పాటు ఎల్‌ఇడి , సోలార్ లైట్లు, పార్కు ఏర్పాటు చేసి అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందన్నారు. పంచాయతీ భవనం పూర్తిగా సోలార్ కాంతులతో నిర్మించామన్నారు. 2లక్షల మొక్కలు నాటినట్లుగానే ఊరూరా నాటి రాష్ట్రాన్ని హరితవనంగా మార్చుదామన్నారు. నాటిన మొక్కకు 5 రూపాయల చొప్పున 3.65 లక్షలు అందిస్తున్నారన్నారు. 50మందికి 25లక్షలతో గొర్రెలను, 8మందికి 65వేల చొప్పున చెక్కులు అందించారు. కూరగాయలసాగుకోసం 40మందికి పందిరిసాగుకు పనులు చేపట్టామన్నారు.
రైతులు సేంద్రీయ వ్యవసాయం వైపు అడుగులు వేయాలన్నారు. డబుల్‌బెడ్ రూం ఇళ్లను పైరవీలు లేకుండా అర్హులకే అందిస్తామన్నారు. కలెక్టర్, ఆర్డీవోలదే ఇందుకు బాధ్యతన్నారు. అనర్హులకు ఇండ్లను ఇచ్చేది లేదన్నారు. గ్రామం వందశాతం పన్నులు వసూలు చేయడంతో పాటు ఐఎస్‌ఎల్ నిర్మించుకొని నిర్మల్ పురస్కార్‌ను దక్కించుకుందన్నారు. 10లక్షలతో డిజిటలైజేషన్ లైబ్రరీ, శ్మశానవాటికను డా. రఘురాం సహకారంతో నిర్మిస్తామన్నారు. అంతకుముందు గ్రామంలో వైఫై సేవలు, గోదాంను ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపి ప్రభాకర్‌రెడ్డి, ఆర్డీఓ ముత్యంరెడ్డి, ఎంపిపి, జడ్పీటీసి, సర్పంచులు పాల్గొన్నారు.

చిత్రం..సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు