తెలంగాణ

రాజకీయ పార్టీ దిశగా టిజెఎసి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 12: టిఆర్‌ఎస్ వ్యతిరేక శక్తులను కూడగట్టి రాజకీయ పార్టీగా అవతరించేందుకు కోదండరామ్ నాయకత్వంలోని తెలంగాణ జెఎసి ప్రయత్నాలు సాగిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. వచ్చే ఎన్నికల నాటికి ఒక రాజకీయ పార్టీగా రూపుదాల్చాలి అనేది జెఎసి ప్రణాళిక. దీనికి తగ్గట్టుగా శిక్షణ కార్యక్రమాలు, రాజకీయ ఆందోళనలకు శ్రీకారం చుట్టారు. ముసుగులో గుద్దులాట కన్నా కోదండరామ్ రాజకీయ పార్టీ ఏర్పాటును స్వాగతిస్తామని టిఆర్‌ఎస్ నాయకులు చెబుతున్నారు. ‘కోదండరామ్ రాజకీయ పార్టీ ఆలోచనలపై మొదటి నుంచి మాకు అవగాహన ఉంది. ఈ ఎత్తుగడలు ముందు నుంచి ఊహిస్తున్నవే’ అని టిఆర్‌ఎస్ ముఖ్యులు చెబుతున్నారు. కోదండరామ్ తాజాగా వివిధ అంశాలపై తన అభిప్రాయాలను జెఎసి కార్యకర్తలు, ప్రజలతో ఫేస్‌బుక్ లైవ్ ద్వారా పంచుకుంటున్నారు. ఏ రాజకీయ నాయకునికి ఇప్పటి వరకు ఎక్కడా లేని విధంగా ఐదు లక్షల మంది కోదండరామ్ ఫేస్‌బుక్ ప్రసంగాన్ని వీక్షించారని జెఎసి ప్రకటించింది. గతంలో కెసిఆర్‌పై అసంతృప్తితో పార్టీ నుంచి బయటకు వెళ్లిన వివిధ ప్రాంతాలకు చెందిన నాయకులతో కోదండరామ్ సంప్రదిస్తున్నారు. భువనగిరి ప్రాంతానికి చెందిన స్థానిక యువనేత జిట్టా బాలకృష్ణారెడ్డితో చర్చలు జరిపారు. అదే విధంగా గ్రామా ల్లో యువతను కలుస్తున్నారు. కోదండరామ్ రాజకీయ పార్టీ ఏర్పాట్లు సాగిస్తుంటే అన్ని రాజకీయ పక్షా లు సైతం తమ వ్యూహాలను తాము అమలు చేస్తున్నా యి. కోదండరామ్ రాజకీయ పార్టీ ఏర్పాటు చేయడం వల్ల టిఆర్‌ఎస్‌కు వచ్చే నష్టం ఏమీ లేదని టిఆర్‌ఎస్ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కోదండరామ్ కార్యక్రమాలకు ప్రస్తుతం కాంగ్రెస్, టిడిపి, వామపక్షాల శ్రేణులు మద్దతు ఇస్తున్నాయి. ఇదే సమయంలో కోదండరామ్ స్వతంత్రంగా జెఎసి తరఫున శ్రేణులను సిద్ధం చేసుకుంటున్నారు. శ్రేణులకు జెఎసి తరఫున శిక్షణ నిర్వహిస్తున్నారు. ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకోవడంపై శిక్షణ ఇచ్చారు. తొలి దశలో కోదండరామ్ ప్రధానంగా నిరుద్యోగులు, విద్యార్థులపై దృష్టి సారించారు.
‘రాష్ట్రంలో దాదాపు మూడు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటాయి. ఇప్పటికే రెండు లక్షల ఉద్యోగులు ఉన్నారు. లక్ష ఉద్యోగులను మాత్రమే నియమించే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించిన ప్రక్రియ సాగుతోంది. ఎంత వేగంగా నియామకాలు జరిపినా లక్ష ఉద్యోగాలను మాత్రమే ప్రభుత్వం భర్తీ చేయగలదు. అదే సమయంలో ఉద్యోగాలు ఆశిస్తున్న వారి సంఖ్య లక్షల్లో ఉంటుంది. లక్ష మందిని మినహాయిస్తే మిగిలిన వారిలోని అసంతృప్తిని అనుకూలంగా ఉపయోగించుకోవడానికి జెఎసి ప్రయత్నించవచ్చు అని అధికార పక్షం నాయకులు చెబుతున్నారు. ‘ఇంతకు ముందు దేవేందర్‌గౌడ్ , గద్దర్, విమలక్క నుంచి నాగం జనార్దన్‌రెడ్డి వరకు ఎంతో మంది పార్టీలు పెట్టారు. చూద్దాం’ అని టిఆర్‌ఎస్ నాయకులు అంటున్నారు. ఇదే సమయంలో ఉద్యమ కాలంలో టిఆర్‌ఎస్ అనుసరించిన వ్యూహానే్న కాంగ్రెస్ అనుసరిస్తోం ది. కెసిఆర్ వ్యతిరేకులు, అనుకూలురు ఎవరు తెలంగాణ ఉద్యమం చేసినా అంతిమంగా అది టిఆర్‌ఎస్‌కు ఉపయోగపడింది. ఇప్పుడు అదే తరహాలో కెసిఆర్‌కు వ్యతిరేకంగా ఎవరు ఉద్యమించినా అది టిఆర్‌ఎస్ తరువాత రాష్ట్రంలో బలంగా ఉన్న కాంగ్రెస్‌కే లాభిస్తుందని కాంగ్రెస్ ఆశిస్తోంది. ఇక రాష్ట్రంలో పెద్దగా ఉనికి లేని టిడిపి మాత్రం టిఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఎవరు ఉద్యమించినా చేతులు కలుపుతామని ప్రకటించింది. పలు ఉప ఎన్నికల్లో ఇదే ధోరణితో కాం గ్రెస్ అభ్యర్థులకు ప్రచారం కూడా చేశారు. సొంతంగా ఎక్కడా ఉనికి చాటుకోలేక పోతున్న వామపక్షాలు జెఎసి ఉద్యమానికి మద్దతుగా నిలవాలని నిర్ణయించుకున్నాయి. వామపక్షాల పోరాట పటిమ జెఎసికి ఉపయోగపడుతుందని జెఎసి భావిస్తోంది. ఇక టిఆర్‌ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు జెఎసిపై విమర్శలు గుప్పిస్తు న్నా, కెసిఆర్ మాత్రం పట్టించుకోవడం లేదు. ఈనెల 22న నిరుద్యోగ ర్యాలీ తరువాత జెఎసి రాజకీయ పార్టీ అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. భవిష్యత్తులో రాజకీయ పార్టీ రూపం దాల్చవచ్చు అని జెఎసి నాయకులు సూచన ప్రాయంగా చెబుతున్నారు.