తెలంగాణ

ఎంజి వర్సిటీలో రాజకీయ రగడ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, ఫిబ్రవరి 12: నల్లగొండ జిల్లాలో చదువుల ప్రాంగణం మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఆదివారం కాంగ్రెస్, టిఆర్‌ఎస్ రాజకీయ రగడకు వేదికైంది. యూనివర్సిటీలో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసేందుకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి జి.జగదీష్‌రెడ్డితో ఎంపిలు గుత్తా సుఖేందర్‌రెడ్డి, బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్యేలు ఎన్. భాస్కర్‌రావు, వేముల వీరేశం, గాదరి కిషోర్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పూల రవిందర్ వచ్చారు. స్థానిక నల్లగొండ శాసనసభ్యుడు, సిఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సైతం వచ్చారు. సిసి రోడ్ల ప్రారంభోత్సం కాగానే కోమటిరెడ్డి రాకను వ్యతిరేకిస్తూ టిఆర్‌ఎస్ శ్రేణులు కోమటిరెడ్డి గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. బదులుగా కోమటిరెడ్డి వర్గీయులు కోమటిరెడ్డి జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ఈ మధ్యలోనే మంత్రులు మిగతా అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు పూర్తిచేసి సమావేశ మందిరానికి చేరుకున్నారు. అప్పటికే అక్కడుకు చేరుకున్న కోమటిరెడ్డి వర్గీయులు, ఎన్‌ఎస్‌యుఐ విద్యార్థులు కోమటిరెడ్డి జిందాబాద్ అంటూ నినాదాలు కొనసాగిస్తున్నారు. వారికి తోడు పలు విద్యార్థి, నిరుద్యోగ సంఘాల వారు గురుకుల పాఠశాల ఉపాధ్యాయుల భర్తీలో టెట్ లేని వారికి కూడా అవకాశం కల్పించాలంటూ ఫ్లకార్డ్సుతో నినాదాలు చేస్త్తూ మంత్రుల వద్దకు చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. వారందరినీ పోలీసులు అడ్డుకుని నిలువరించారు.

చిత్రం..ఎంజి యూనివర్సిటీలో మంత్రుల ముందు నిరుద్యోగ, విద్యార్థి సంఘాల నిరసన