తెలంగాణ

కాళేశ్వరం ఎత్తిపోతల ఎస్సారెస్పీకి వరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోర్తాడ్, ఫిబ్రవరి 13: తెలంగాణ వరప్రదాయినిగా విలసిల్లుతున్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కింద రైతులు సమృద్ధిగా పంటలు పండించుకునేలా కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని భారీ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టులు పూర్తయితే లక్షలాది ఎకరాలకు సాగునీరు సమకూరుతుందని ఆయన స్పష్టం చేశారు. మోర్తాడ్ మండలం శెట్పల్లి ఊర చెరువులో నిర్మించిన చౌట్‌పల్లి హన్మంత్‌రెడ్డి ఎత్తిపోతల పథకాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో హరీశ్ మాట్లాడుతూ, 80 టిఎంసిల సామర్థ్యం గల శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం 40 టిఎంసిల నీరు మాత్రమే ఉందని, దీంతో అందరికీ నీరిందించడం ఇబ్బందికరంగా మారిందని చెప్పారు. ఎంపి కవిత మాట్లాడుతూ, తాగు, సాగునీటి సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి కెసిఆర్ భగీరథ యత్నాలు చేస్తున్నారని, కేవలం పది నెలల వ్యవధిలోనే భక్తరామదాసు ప్రాజెక్టును పూర్తి చేసి 10 వేల ఎకరాలకు నీరందించడం ద్వారా ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకుందని అన్నారు. బాల్కొండ నియోజకవర్గంలో ఎత్తిపోతల పథకాలకు ఇప్పటివరకు 116 కోట్ల రూపాయలను కేటాయించామని, త్వరలోనే ఈ పనులు పూర్తవుతాయని ఆమె తెలిపారు.
అనంతరం గాండ్లపేట పెద్దవాగులో నిర్మించనున్న చెక్‌డ్యాం నిర్మాణానికి మంత్రితో పాటు ఎంపి, ఎమ్మెల్యేలు భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో గోదావరి బేసిన్ చీఫ్ ఇంజనీర్ మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం.. ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభిస్తున్న మంత్రి హరీశ్‌రావు, ఎంపి కవిత, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి