తెలంగాణ

కొత్త భవనాల నిర్మాణమెందుకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి కొత్త అసెంబ్లీ, కొత్త సచివాలయం భవనాల నిర్మాణం అనవసరమని, దీనివల్ల ప్రజాధనం వృథా అవుతుందని, ఈ ఆలోచనలను విరమించుకోవాలని ఎంఐఎం పార్టీ శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ ప్రభుత్వాన్ని కోరారు. ‘ఇప్పటికే ఒకటికి రెండు అసెంబ్లీలు ఉన్నాయి. ఒక అసెంబ్లీలో మనం, మరో అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నడుస్తోంది. సచివాలయానికి భవనాలు ఉన్నాయి. మళ్లీ వీటిని నిర్మించడం తగదు. వీటిపైన వెచ్చించే సొమ్ముతో డబుల్ బెడ్‌రూం ఇళ్లను నిర్మించండి. సంక్షేమ పథకాలకు వెచ్చించండి’ అని ముఖ్యమంత్రి కెసిఆర్‌ను కోరారు. శనివారం శాసనసభలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా అక్బరుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ తాను బడ్జెట్‌లోని అనేక అంశాలను స్వాగతిస్తున్నానని, ఎంఐఎం, టిఆర్‌ఎస్ మిత్రపక్షాలన్నారు. రాష్ట్రప్రభుత్వం ఎఫ్‌ఆర్‌బిఎం పరిమితిని పెంచుకోవాలనుకుంటున్నా, ఇంతవరకు కేంద్రం అనుమతించలేదన్నారు. పన్నుల వసూళ్ల లక్ష్యం ఎక్కువగా పెట్టుకున్నా ఆశించినట్లుగా వసూలు కావడం లేదన్నారు. వాణిజ్య పన్నుల వసూళ్ల వృద్ధిరేటు బాగాలేదని, ఎక్సైజ్ ఆదాయం మాత్రం బాగుందన్నారు. రాష్ట్రం అప్పు 1.28 లక్షల కోట్లకు చేరుకుందన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల వృద్ధిరేటు పడిపోయిందన్నారు. డబుల్ బెడ్‌రూం ఇళ్ల స్కీం మంచిదని, కాని ఇంత భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ ఇళ్లకు నిధులు ఎక్కడ నుంచి తెస్తారని ప్రశ్నించారు. రాష్ట్రం ప్రతిపాదించిన ఈ స్కీం పూర్తి చేసేందుకు బ్రిక్స్ బ్యాంకు నుంచి నిధులు తెస్తానంటున్న ప్రభుత్వం జాగ్రత్తగా ఉండాలన్నారు. తెలంగాణ జెన్కో రూ.91 వేల కోట్లతో నిర్మించనున్న ప్రాజెక్టుల విషయంలో రుణాలను తీసుకురావడంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. ‘మాకు ముఖ్యమంత్రి కెసిఆర్ అంటే నమ్మకం ఉంది. కాని రాష్ట్రప్రజల సంక్షేమం విషయంలో అలుపెరగకుండా పోరాడుతాం’ అన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ స్కీం కింద అన్ని వర్గాల విద్యార్ధులకు వెంటనే పెండింగ్ బిల్లులు చెల్లించాలన్నారు. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు సభా సంఘం నియమించాలన్నారు. పోలీ సు స్టేషన్లలో సిసిటివిలను ఏర్పాటు చేయాలన్నారు.
సిపిఎం ఎమ్మెల్యే సున్నం రాజ య్య మాట్లాడుతూ, భూసంస్కరణల అమలులో రాష్ట్రప్రభుత్వం తమ సూ చనలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనుల హక్కులను పరిరక్షించాలన్నారు. సిపిఐ ఎమ్మెల్యే రవీంద్రనాయక్ మాట్లాడుతూ నిధుల కొరత లేదని చెబుతున్న రాష్ట్రప్రభుత్వం మాటలు నమ్మశక్యంగా లేవన్నారు.

శనివారం శాసనసభలో మాట్లాడుతున్న
ఎంఐఎం పార్టీ శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ