తెలంగాణ

వంశీరెడ్డి మృతదేహాన్ని ‘తీసుకువచ్చేందుకు చర్యలు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నక్కలగుట్ట (వరంగల్) ఫిబ్రవరి 13: వరంగల్ అర్బన్ జిల్లా హసన్‌పర్తి మండలంలోని వంగపహాడ్ గ్రామానికి చెందిన సంజీవరెడ్డి కుమారుడు వంశీరెడ్డి అమెరికా కాలిఫోర్మియాలో ఆగంతకుని కాల్పులలో మృతి చెందిన విషయం విదితమే. సోమవారం సంజీవరెడ్డి కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లో పలువురు నాయకులను కలసి వంశీరెడ్డి మృతదేహాన్ని త్వరగా తీసుకుని వచ్చేందుకు ప్రయత్నాలు చేయాలని కోరారు. వారు భాజపా నేత కిషన్‌రెడ్డితో కలసి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ వద్దకు వెళ్లగా, ఆయన కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌కు ఫోన్ ద్వారా విషయాన్ని తెలుపగా ఆమె సానుకూలంగా స్పందించి మృతదేహాన్ని తీసుకునివచ్చేందుకు భారత ప్రభుత్వం ద్వారా తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకుంటామని, వీలైనంత త్వరగా మృతదేహాన్ని భారత్ రప్పించడానికి ప్రయత్నాలు చేస్తామని హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు. అనంతరం వరంగల్‌లోని స్థానిక ఎమ్మెల్యేలతో కలసి ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి కలవగా ఆయన కూడా సానుకూలంగా స్పందించి ప్రభుత్వ ఖర్చుతో మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకుని వచ్చేలా అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా, వంశీరెడ్డి కుటుంబ సభ్యులను సోమవారం నగర మేయర్ నన్నపనేని నరేందర్, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి పరామర్శించారు. రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి మృతదేహాన్ని తీసుకుని రావడానికి తమ వంతు ప్రయత్నం చేస్తామని, బాధిత కుటుంబానికి బాసటగా ఉంటామని తెలిపారు.