తెలంగాణ

చైనా వెళ్తున్న కడియం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 13: అతిపెద్ద అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు సంబంధించి అధ్యయనానికి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఈ నెల 14వ తేదీ నుండి 21 వరకూ చైనాలో పర్యటించనున్నారు. బాబా సాహెబ్ అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం 125 అడుగుల భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 36 ఎకరాల విస్తీర్ణంలో స్మృతివనం కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విగ్రహ ఏర్పాటు, స్మృతివనం అత్యద్భుతంగా ఉండేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో ఒక కమిటీని నియమించారు. ఈ కమిటీలో ఎస్సీ సంక్షేమ మంత్రి జగదీష్‌రెడ్డి, ఎంపిలు బాల్క సుమన్, పసునూరి దయాకర్, ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్, రసమయి బాలకిషన్ అధికారులు కలిసి చైనాలో విగ్రహాల తయారీ కేంద్రాలను, శిల్పకారులను కలిసి చర్చిస్తారు.