తెలంగాణ

వకుళమాత ఆలయ నిర్మాణం హర్షణీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్/హైదరాబాద్, ఫిబ్రవరి 13: వకుళమాత ఆలయ నిర్మాణానికి తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) పూనుకోవడం హర్షణీయమని శ్రీ పీఠం వ్యవస్థాపకులు స్వామి పరిపూర్ణానంద అన్నారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేఖరుల సమావేశంలో హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ వ్యవస్థాపకులు పివిఆర్‌కె.ప్రసాద్, సమరసత్తా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, మాజీ ఛీఫ్ సెక్రెటరీ ఐవైఆర్ కృష్ణారావులతో కలిసి ఆయన మాట్లాడారు. తిరుపతి పేరూరు కొండ మీద వకుళమాత ఆలయం ఉందని, సుమారు 450 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని కొంతమంది మైనింగ్ వ్యాపారులు ప్రణాళికాబద్ధంగా కూల్చివేతలకు యత్నించారని ఆరోపించారు. ఇందులో భాగంగా సగం వరకు కూల్చివేతలు సైతం జరిగాయని చెప్పారు. ఈ విషయాన్ని మీడియా ద్వారా తెలుసుకున్న వివిధ హిందూ పరిరక్షణ సంఘాలు ఉద్యమంగా మార్చడంతో ప్రపంచానికి వెలుగులోకి వచ్చిందన్నారు. అనంతరం ఈ విషయమై న్యాయస్థానాన్ని ఆశ్రయించగా మైనింగ్ వ్యాపారులు మొదట స్టే తెచ్చుకున్నా అనంతరం న్యాయస్థానం పూర్తిస్థాయిలో విచారణ జరిపి ఆలయాన్ని పునఃనిర్మించాలని ఆదేశాలు జారీచేయడం ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు. ఆలయ పునఃనిర్మాణానికి గ్లోబల్ హెరిటేజ్ ఫౌండేషన్, సేవ్ టెంపుల్ ఆర్గనైజేషన్‌తో పాటు మీడియా సైతం ఎంతగానో తోడ్పాటును అందించాయన్నారు.
మార్చి 5న ఆలయ పునః నిర్మాణం కోసం భూమి పూజ జరుగుతున్నందున తాను గతంలో తీసుకున్న ప్రతిజ్ఞ మేరకు కాలినడక శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని భూమి పూజకు హాజరౌతానని పరిపూర్ణానంద తెలిపారు.

చిత్రం..సోమవారం హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడుతున్న శ్రీ పీఠం వ్యవస్థాపకులు స్వామి పరిపూర్ణానంద. చిత్రంలో ఐవైఆర్, పివిఆర్‌కె ప్రసాద్ తదితరులు ఉన్నారు