తెలంగాణ

ఒవైసీ రాక సందర్భంగా భైంసాలో ఉద్రిక్తత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భైంసా రూరల్: ఆదిలాబా ద్ జిల్లా భైంసాలో శనివారం ఇరువర్గాల ఘర్షణలో పోలీసులతోపాటు పలువురికి గాయాలయ్యాయి. స్థానిక హిందూవాహిని కార్యకర్తలు పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీకి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించి ఐబి ప్రాంతంలో ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో భైంసాకు అసదుద్దీన్ ఒవైసీ వస్తుండగా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి ఒవైసీ దిష్టిబొమ్మను దగ్ధంచేసే కార్యకర్తలపై లాఠీచార్జి చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొనగా హిందూవాహిని కార్యకర్తలందరినీ విశ్రాంతి భవనంలోకి పంపి ప్రహరీని మూసివేశారు. అదే సమయంలో అటు గా ఒవైసీ కాన్వాయ్ వెళ్తుండగా పలువురు రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో ఒక టివి చానల్‌లో పనిచేస్తున్న ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఒవైసీ బస్టాండ్ ప్రాంతం నుండి దాటి వెళ్లిన అనంతరం పలువురు యువకులు కర్రలను చేతబట్టి వీరంగం సృష్టించేందుకు వీధులపైకి ఎగబడ్డారు. ఈ ఘటనలో పులేనగర్‌కు చెందిన వ్యక్తిని కర్రలతో గాయపర్చారు. అనంతరం బస్టాండ్ ప్రాంతంలో గుమిగూడిన పలువురు దాడికి ఎగబడే ప్రయత్నాన్ని చేశారు. బస్టాండ్ ప్రాంతంలో సైతం మరొకరిని గాయపర్చారు. దీంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. అదే సమయంలో బస్టాండ్ వద్ద విధులు నిర్వహిస్తున్న నిర్మల్ రూరల్ పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్‌ను సైతం గాయపర్చారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారే పరిస్థితుల్లో భైంసా సబ్‌డివిజన్, నిర్మల్ సబ్‌డివిజన్‌లకు చెందిన ఎస్సైలు, డిఎస్పీలు బందోబస్తును పర్యవేక్షించారు. ఆందోళన సమయంలో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పోలీసులు దుకాణాలను సైతం మూసివేయించారు. వివిధ పనుల నిమిత్తం భైంసాకు వచ్చిన ప్రయాణికులు బిక్కు బిక్కుమంటూ దొరికిన వాహనంలోకి ఎక్కి తిరుగు ప్రయాణమయ్యారు. పరిస్థితి సద్దుమణిగేందుకు పోలీసులు గస్తీలను ఏర్పాటుచేయనున్నారు.

లాఠీచార్జి చేస్తున్న పోలీసులు