తెలంగాణ

అద్భుతం... ఆ చిన్నారి జ్ఞాపకశక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబాబాద్, ఫిబ్రవరి 13: చదువుతున్నది 3వ తరగతే.. కానీ ఆ చిన్నారి జ్ఞాపకశక్తి అపూర్వం. ప్రపంచపటంలో 236 దేశాలను కేవలం 2.38 సెకన్ల వ్యవ ధిలో గుర్తించి ఆ చిన్నారి అతిధులను అబ్బురపరచడమే కాక, రెండు గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులను సొంతం చేసుకుంది. మహబూబాబాద్‌లోని శ్రీచైతన్య టెక్నో స్కూల్లో 3వ తరగతి చదువుతున్న భూక్య చిరుతేజ్‌సింగ్ రాథోడ్ సోమవారం జిల్లా కలెక్టర్ ప్రీతిమీనా సమక్షంలో ఈ రెండు రికార్డులను కైవ సం చేసుకుంది. పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రపంచ పటంలో ఉన్న 236 దేశాలను అతి స్వల్పకాలంలో గుర్తించడం ద్వారా ఈ రికార్డు చిన్నారి సొంతమైంది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఇంత చిన్న వయసులో అసామాన్య ప్రతిభ కనబర్చిన చిరుతేజ్‌సింగ్‌ను ప్రత్యేకంగా ప్రశంసించారు. మున్ముందు మరిన్ని రికార్డులు స్వంతం చేసుకోవాలని ఆశీర్వదించారు. ఐఎఎస్ పరీక్షలకు సిద్ధమవుతున్న సమయంలో వివిధ దేశా ల గుర్తుపెట్టుకోవడానికి తాను చాలా కష్టపడ్డా నని, అయతే చిరుతేజ్‌సింగ్ రాథోడ్ అలవోకగా పలు దేశాల పేర్లు చెప్పడం ఎంతో ఆశ్చర్యాన్ని, అంత కంటే ఎక్కువ సంతోషాన్ని కలిగించాయన్నారు. ఇలాం టి ప్రతిభావంతులను ప్రోత్సహిస్తే మరి న్ని గొప్ప విజయాలను సాధిస్తారని కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఒకే నిమిషంలో అతి వేగంగా 88 దేశాల పేర్ల ను గుర్తిం చి ఇదే వేదికపై మరో రికార్డు ను సాధించింది. ఈకార్యక్రమంలో గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు నేషనల్ హెడ్ డాక్టర్ మనీష్ విష్ణోయి స్వయంగా పాల్గొని అరుదైన రెండు రికార్డులను కలెక్టర్ చిరుతేజ్‌సింగ్ రాథోడ్‌కు అందజేశారు. తల్లిదండ్రులు కిరణ్‌సింగ్, వసంత, చైతన్య పాఠశాల చైర్మన్ శ్రీధర్, డిజిఎం టి.జయలక్ష్మి, ప్రిన్సిపల్ మధు, ఓంనారాయణలోయ, లక్ష్మినారాయణ, సుధాకర్, విద్యార్థులు పాల్గొన్నారు.

చిత్రం..గోల్డెన్ బుక్‌ఆఫ్ వరల్డ్ రికార్డు ధ్రువీకరణ పత్రాన్ని చిరుతేజ్‌సింగ్‌కు
అందజేస్తున్న కలెక్టర్ ప్రీతిమీనా