తెలంగాణ

పెద్దగట్టుకు పోటెత్తిన భక్తజనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రవాహంలా తరలివస్తున్న భక్త జనసందోహంతో గొల్లగట్టు జాతర కిక్కిరిసిపోయింది. ఆదివారం అంతంతమాత్రంగా ఉన్న భక్తజనం సోమవారం పోటెత్తింది. లింగా.. ఓ లింగా.. అంటూ భక్తులు పారవశ్యంతో లింగమంతుల స్వామిని దర్శించుకున్నారు. జాతరలో ప్రధాన ఘట్టంగా భావించే సోమవారం సుమారు 8 లక్షల మంది తరలివచ్చినట్లు అధికారులు అంచనా వేశారు.
**

సూర్యాపేట, ఫిబ్రవరి 13: దురాజ్‌పల్లి శ్రీ లింగమంతుల స్వామి పెద్దగట్టు (గొల్లగట్టు) జాతరకు భక్తులు పోటెత్తారు. లింగమంతుని స్మరణ దశదిశలా మార్మోగింది. ఆదివారం రాత్రి నుంచి ప్రారంభమైన భక్తజన ప్రవాహం క్షణక్షణానికి అధికమై సోమవారం రాత్రి వరకు కొనసాగుతూనే ఉంది. లక్షల సంఖ్యలో భక్తులు తరలిరావడంతో దేవాలయం, జాతర పరిసరాలన్నీ కిటకిటలాడాయ. లింగా... ఓలింగా... అంటూ భేరీనాదాలు, డప్పుల చప్పుళ్లతో నృత్యాలు చేసుకుంటూ భక్తిపారవశ్యం తో తమ ఇష్టదైవమైన లింగమయ్యకు మొక్కులు తీర్చుకున్నారు. బలిచ్చేందుకు వెంట తెచ్చిన మేకలు, గొర్రెపొట్టేళ్లతో గుట్టపైన ఆలయాల చుట్టూ భక్తులు పరుగులు తీస్తున్నారు. కొందరు భక్తులు గుడిచుట్టు పొర్లుదండాలతో మొక్కులు తీర్చుకుంటున్నారు. యాదవుల ఆరాధ్యదైవంగా ప్రసిద్ధిగాంచిన ఈ జాతరలో సంప్రదాయ దుస్తు లు ధరించి బోనాల గంపలను నెత్తిన పెట్టుకొని గుడిచుట్టు ప్రదక్షిణలు చేసి తమ కోర్కెలను తీర్చమంటూ లింగమయ్యను వేడుకున్నారు. మరికొందరు పూనకాలతో ఊగిపోయారు. డప్పువాయిద్యాలు, ఈలల మోతలతో అంతటా సందడి నెలకొంది. ఆదివారం రాత్రి 10 గంటల నుంచి భక్తుల ఉధృతి తీవ్రమవడంతో దేవాలయం వద్ద ఒక దశలో తోపులాట జరిగింది. అయితే పోలీసులు సకాలంలో స్పందించి సమస్యను పరిష్కరించారు. ఆదివారం అర్ధరాత్రి నుండి సోమవారం వరకు సుమారు ఎనిమిదిలక్షల మందికిపైగానే భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు అధికారులు అంచనా వేశారు. రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, టిడిఎల్పీ నేత ఏనుముల రేవంత్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ కేతవత్ బాలునాయక్, మాజీ ఎమ్మెల్యే నోముల నర్సింహాయ్యలు పెద్దగట్టును సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. కాగా, తప్పిపోయిన పిల్లలను (గుట్టపైనున్న) హెల్ప్‌లైన్ సెంటర్ వద్దకు చేర్చి మైకుల ద్వారా వారి వివరాలను తెలియజేస్తున్నారు. అయినా కొంతమంది పిల్లల తమ తల్లిదండ్రులు రాకపోవడంతో బిక్కముఖాలేసుకొని ఏడుస్తూ కూర్చున్నారు. జిల్లా కలెక్టర్ కడవేరు సురేంద్రమోహన్, జిల్లా ఎస్పీ పరిమళ గుట్టపైనే ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. జంతుబలిని నిరోధించామని ప్రకటించిన అధికారులు ఈ దిశగా చర్యలు తీసుకున్న దాఖలాలు కన్పించలేదు. దీంతో వేలసంఖ్యలో మూగజీవాలను యథేచ్ఛగా బలిచ్చారు. జాతరకు తరలి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా ఈసారి మెరుగైన రీతిలో ఏర్పాట్లు చేపట్టారు.

చిత్రాలు.. జాతర అలంకరణలో శ్రీలింగమంతులస్వామి

*భక్తజన ప్రవాహంతో కిటకిటలాడుతున్న పెద్దగట్టు