తెలంగాణ

విద్యుత్ ఛార్జీల పెంపునకు విముఖం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 14: మున్ముందు విద్యుత్ ఛార్జీలు పెంచే విషయంపై ప్రభుత్వం ఆచితూచి అడుగువేస్తోంది. ఛార్జీల పెంపునకు విముఖత చూపిస్తోంది. ఒకవేళ పెంచినా నామమాత్రంగానే ఉండాలని భావిస్తోంది. అయితే ఇప్పటికే నష్టాలు చవిచూస్తున్న డిస్కంలకు సబ్సిడీ కేటాయింపులు భారీగా పెంచి గట్టెక్కించాలే తప్ప ఛార్జీల జోలికి ప్రభుత్వం వెళ్లదని తెలుస్తోంది. తెలంగాణ విద్యుత్ డిస్కంలకు వచ్చే ఏడాదికి భారీ ఎత్తున రూ. 5000 కోట్ల వరకు రాష్ట్రప్రభుత్వం సబ్సిడీ ఇచ్చే దిశగా కసరత్తు చేస్తోంది. ఈ ఏడాది ఇంతవరకు డిస్కంలు విద్యుత్ టారిఫ్ ప్రతిపాదనలను తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలికి సమర్పించలేదు. ఈ ప్రతిపాదనలను వాస్తవానికి గత ఏడాది డిసెంబర్ లోపలే మండలికి ఇవ్వాల్సి ఉంది. ‘ఉదయ్’ స్కీంలో డిస్కమ్‌లు చేరే విషయమై ప్రభుత్వం ఆలస్యంగా నిర్ణయం తీసుకుంది. దీని వల్ల డిస్కంలు నష్టాలను రాష్ట్రప్రభుత్వం భరిస్తోంది. కాని విద్యుత్ టారిఫ్ చార్జీలను పెంచితేనే డిస్కంలు భవిష్యత్తులో నష్టాల బారినపడకుండా గట్టెక్కుతాయి. తెలంగాణ డిస్కంలు జనవరి 18వ తేదీలోపల టారిఫ్ ప్రతిపాదనలు సమర్పించేందుకు మండలి గడువు ఇచ్చింది. కాని ఫిబ్రవరి నెలలో సగం రోజులు గడుస్తున్నా ఇంతవరకు ప్రతిపాదనలను సమర్పించలేదు.
2017-18 సంవత్సరాలకు విద్యుత్ రెవెన్యూ లోటు ఆరు వేల కోట్లను పూడ్చుకోవాలంటే విద్యుత్ చార్జీలను పెంచకతప్పదు. కాని ముఖ్యమంత్రి కెసిఆర్ విద్యుత్ చార్జీలను పెంచేందుకు సుముఖంగా లేరని తెలంగాణ విద్యుత్ శాఖ వర్గాలు తెలిపాయి. ‘ఉదయ్’ స్కీంలో చేరడం వల్ల డిస్కంలపై రూ.890 కోట్ల భారం తగ్గింది. 2017-18, 2018-19 సంవత్సరాల్లో విద్యుత్ చార్జీలు పెంచకుండా ప్రత్యామ్నాయ మార్గాలపై ముఖ్యమంత్రి దృష్టిని సారించినట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ఒక వేళ స్వల్పంగా పెంచేందుకు మాత్రమే అనుమతించే అవకాశం ఉందన్నారు. 2016-17 సంవత్సరంలో రాష్ట్రప్రభుత్వం డిస్కంలకు రూ. 4584 కోట్ల సబ్సిడీని సమకూర్చింది. వచ్చే ఏడాది 2017-18కి ఈ సబ్సిడీ భారాన్ని ఐదు వేల కోట్లకు పెంచితే, విద్యుత్ చార్జీలను మూడు శాతం కంటే మించి పెంచేందుకు అవకాశం ఉండదంటున్నారు.
రాష్ట్రంలో 1.32 లక్షల మంది విద్యుత్ వినియోగదారులు ఉన్నారు. 15 నుంచి 20 శాతం టారిఫ్ పెంచితే తీవ్రమైన వ్యతిరేకత ప్రజల నుంచి వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ఒక మోస్తరు విద్యుత్ చార్జీలను పెంచినా విపక్షాలకు ఆయుధం ఇచ్చినట్లవుతుంది. అందుకే కెసిఆర్ టారిఫ్ ప్రతిపాదనల పెంపుపై ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఒక వైపు టి జాక్ కన్వీనర్ కోదండరామ్, మరో వైపు కాంగ్రెస్ పార్టీ వివిధ ప్రజా సమస్యలపై ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలకు సిద్ధమవుతున్నాయి. డిస్కంలు ఇచ్చిన ప్రతిపాదనలు ఆమోదిస్తే రెండు వేల కోట్ల రూపాయల మేర చార్జీలను పెంచాల్సి వస్తుంది. ముఖ్యమంత్రి అనుమతి ఇచ్చిన వెంటనే టారిఫ్ ప్రతిపాదనలు సమర్పిస్తామని జెన్కో ఉన్నతాధికారి చెప్పారు.