తెలంగాణ

ఉపాధి కార్మికులకు వేసవి ‘అలవెన్స్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 14: జాతీయ ఉపాధి హామీ పథకం (ఎన్‌ఆర్‌ఇజిపి) కింద కూలీలకు ఎండాకాలంలో పనిభారం తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.పి. సింగ్ పేరుతో మంగళవారం ఒక జీఓ జారీ అయింది. ఎండాకాలంలో పగటివేళ ఎక్కువగా ఎండలో ఉండటం వల్ల ఆరోగ్యం దెబ్బతింటోందని, అందువల్ల పనిభారం తగ్గించాలని నిర్ణయించారు. ఈ విధంగా పనిభారం తగ్గించడాన్ని ప్రత్యేక అలవెన్స్‌గా పరిగణిస్తున్నారు. సాధారణ రోజుల్లో పనిభారంతో పోలిస్తే 2017 ఫిబ్రవరి లో 20 శాతం పనిభారం తగ్గించాలని, మార్చిలో 25శాతం పనిభారం తగ్గించాలని, ఎప్రిల్/మే నెలల్లో 30శాతం, జూన్‌లో 20శాతం పనిభారం తగ్గించాలని నిర్ణయించారు. పనిభారం తగ్గించినప్పటికీ, రోజూ ఇచ్చే కూలీ మాత్రం సాధారణ రోజుల్లాగే ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి డైరెక్టర్, జిల్లా కలెక్టర్లు అవసరమైన చర్యలు తీసుకోవాలని జీఓలో పేర్కొన్నారు.