తెలంగాణ

కేంద్ర నిధులపై దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 14: కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా రాష్ట్రానికి పెద్దమొత్తంలో నిధులు రాబట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని వివిధ శాఖాధిపతులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్ ఆదేశించారు. సచివాలయంలో మంగళవారం సంబంధిత అధికారులతో ఎస్‌పి సింగ్ సమీక్షించారు. పంచాయతీరాజ్ శాఖలో వివిధ పథకాల కింద కేంద్రం నుంచి మార్చిలోగా రావాల్సిన నిధులు, రాష్ట్ర ప్రభుత్వ మ్యాచింగ్ గ్రాంట్‌లకు ప్రతిపాదనలు, ఇప్పటికే అందిన నిధులకు యుటిలైజేషన్ సర్ట్ఫికెట్లు సమర్పించాలన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక పథకాలు పిఎంజిఎస్‌వై, స్వచ్ఛ భారత్ మిషన్, ఎంఎన్‌ఆర్‌ఇజి ద్వారా కేంద్రం నుంచి అధిక నిధులు సాధించాలని ఆదేశించారు. దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కృషి యోజన, నేషనల్ రూరల్ లైవ్ లీ హుడ్ మిషన్, జాతీయ గ్రామీణ జీవనోపాధి కార్యక్రమం, కృషి సంచాయ్ యోజన, నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ తదితర కార్యక్రమాలను సిఎస్ సమీక్షించారు.