తెలంగాణ

నేతన్నకు సర్కార్ చేయూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 14: చేనేత కార్మికులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలిచి ఆదుకోవడానికి ప్రత్యేక విధానాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. నేత కార్మికుల సంక్షేమం కోసం ఎంత డబ్బు ఖర్చు చేయడానికైనా ప్రభు త్వం సిద్థంగా ఉందని ముఖ్యమంత్రి అన్నారు. ప్రపంచ ప్రసిద్థిగాంచిన గద్వాల, నారాయణపేట, పోచంపల్లి వస్త్రాలకు పూర్వ వైభవం తీసుకురావడానికి చర్యలు తీసుకుంటామన్నారు. ప్రగతి భవన్‌లో మంగళవారం చేనేత, మరమగ్గాల కార్మికుల సంక్షేమంపై ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సిఎంఒ ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, చేనేతశాఖ డైరెక్టర్ శైలజా రామయ్యార్, జాయింట్ డైరెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, డిప్యూటీ డైరెక్టర్ రాంగోపాల్ తదితరులతో ముఖ్యమంత్రి చర్చించారు. రాష్ట్రంలో ఒకప్పుడు పెద్ద ఎత్తున చేనేత వృత్తిపై ఆధారపడి జీవించే కార్మికులు ఉండేవారని, అయితే కాలక్రమేణ చేనేత వస్త్రాల వాడకం తగ్గడంతో వారి బతుకులు చితికిపోయాయని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. చాలా మంది చేనేత వృత్తిని వదులుకున్నారని, మరో పనిచేయలేక జీవితం చాలించారన్నారు. ప్రస్తుతం ఎంతో మంది కార్మికులు పవర్‌లూమ్ ఫ్యాక్టరీలలో దినసరి కూలీలుగా జీవితాలను వెల్లదీస్తున్నారని అన్నారు. అలాంటి వారి జీవితాల్లో వెలుగులు నింపేలా కార్యక్రమాలను రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ‘ప్రస్తుతం చేనేత కార్మికుల బతుకులు చాలా దీనంగా ఉన్నాయని, నమ్ముకున్న కులవృత్తి కడుపునిండా అన్నం పెట్టలేని పరిస్థితి ఏర్పడంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అలాంటి వారిని ఆదుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమం చేపడుతుంది’ అన్నారు. చేనేత, నేత కార్మికులు తయారు చేసే వస్తువులకు మార్కెటింగ్ కల్పించడానికి వారికి ప్రభుత్వం తరఫున ఆర్డర్లు ఇవ్వాలని సూచించారు. స్కూల్ పిల్లల యూనిఫారాలు, హాస్పిటల్స్, హాస్టళ్లు, పండుగలప్పుడు ప్రభుత్వం పేదలకు పంచే దుస్తులు, పోలీస్ యూనిఫారాలు తదితర ఆర్డర్లు అన్ని చేనేత కార్మికులకు ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మరమగ్గాలపై ఆధారపడిన కార్మికులకు సరిపడ పనిని కల్పించాలన్నారు. ముడి నూలును సబ్సిడీపై అందించాలని, ఇప్పటికే నేసిన స్టాక్‌ను కొనుగోలు చేయాలన్నారు. అలాగే చేనేత వృత్తిని వదులుకుని ప్రత్యామ్నాయ ఉపాధిని చూసుకునేవారికి కూడా చేయూత ఇవ్వాలన్నారు. గద్వాల, నారాయణపేట, పోచంపల్లి తదితర ప్రాం తాల్లో కళాత్మకమైన పట్టు వస్త్రాలు నేస్తారన్నారు. వారికి అంతర్జాతీయ మార్కెట్ ఉందని, వాటిని ప్రోత్సహించాలని, అవసరమైన చేయూతనివ్వాలన్నారు. ఆ కళ తెలంగాణకు ప్రత్యే కం కావడంతో కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఒకప్పుడు హైదరాబాద్‌లో సిద్దిపేట గొల్లబామ చీరలను ప్రత్యేకంగా అమ్మేవారని, అలాంటి ప్రత్యేకతలున్న వస్త్రాలకు పూర్వవైభవం తీసుకురావాలన్నారు. వీటి కోసం ఎంత డబ్బు ఖర్చు అయినా పెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి అన్నారు.