తెలంగాణ

కార్పొరేషన్లకు ప్రత్యేకంగా నిధులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 14: రాబోయే ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో మున్సిపల్ కార్పోరేషన్లకు ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తామని రాష్ట్ర మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కె. తారక రామారావు తెలిపారు. కార్పోరేషన్ల కమిషనర్లతో మంత్రి కెటిఆర్ మంగళవారం సమావేశమై పలు సూచనలు చేశారు. ప్రజలకు అవసరమైన రోడ్లు, మార్కెట్లు, టాయిలెట్లు, పార్కులు, బస్-బేలు, బస్ షెల్టర్ల వంటి కనీస వసతుల కల్పనపై దృష్టి సారించాలని ఆదేశించారు. మున్సిపాలిటీలు, కార్పోరేషన్లపై ముఖ్యమంత్రి ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారని ఆయన తెలిపారు. పట్టణాల్లోని జనాభాకు అనుగుణంగా టాయిలెట్ల నిర్మాణం జరగాలని అన్నారు. పట్టణాలను ఒపెన్ ఢీపెకేషన్ ఫ్రీ చేసేందుకు ఉగాదిలోగా పెట్టుకున్న గడువు మేరకు పని చేయాలని ఆయన సూచించారు. పట్టణాల్లో అనధికార ప్లెక్సీలు, వాల్ రైటింగ్ చేసే వారి పట్ల కేసులు నమోదు చేసి శిక్షించాలని అన్నారు. కార్పోరేషన్ల ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ సిబ్బంది మేయర్లు, కార్పోరేటర్లు, ఇతర అధికారుల వద్ద పని చేస్తే కమిషనర్లపై చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు.
కనీస వసతుల కల్పనపై దృష్టి సారించాలని ఆయన కమిషనర్లను ఆదేశించారు. ఈ దఫా బడ్జెట్‌లో కార్పోరేషన్లకు ప్రత్యేకంగా కొంత నిధులు కేటాయిస్తామని అన్నారు. రోడ్డు నిర్మా ణం జరుగుతున్నప్పుడే పుట్ పాత్‌ల నిర్మాణం చేపట్టాలని ఆయన సూచించారు. ముఖ్యం గా కమ్యూనిటీ టాయిలెట్స్‌కు దారి, దూరం వంటి వివరాలకు కూడిన బోర్డులు ఏర్పాటు చేయలన్నారు. త్వరలో మూడు కార్పోరేషన్లలో ఐదు రూపాయల భోజన పథకాన్ని విస్తరించనున్నట్లు చెప్పారు. పట్టణాల్లో ఎల్‌ఈడీ లైట్ల ఏర్పాటును పూర్తి చేయాలన్నారు.

చిత్రం..కార్పోరేషన్ల కమిషనర్లతో మంగళవారం సమావేశమైన మంత్రి కెటిఆర్