తెలంగాణ

స్టేను ఉపసంహరించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 15: తెలంగాణలో జివో నెం.123ను అనుసరించి సాగునీటి ప్రాజెక్టు అవసరాల కోసం భూ సేకరణ చేపట్టేందుకు వీలుగా గతంలో విధించిన స్టేను ఉపసంహరించాలని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టును అభ్యర్థించింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, జస్టిస్ షమీమ్ అక్తర్‌తో కూడిన బెంచ్‌కు తెలంగాణ అడ్వకేట్ జనరల్ కె.రామకృష్ణారెడ్డి తన వాదనలు తెలియజేస్తూ బాధిత రైతులు, వారి కుటుంబాలను ఆదుకుని తగిన పరిహారం చెల్లించేందుకు ప్రత్యేక జివోను జారీ చేసిందని తెలిపారు. స్టే కారణంగా ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి భూ సేకరణ చేపట్టడం కష్టంగా మారిందని తెలిపారు. ఈ కేసులో వాదనలను వచ్చే మంగళవారం వింటామని బెంచ్ స్పష్టం చేసింది. పరిహారం చెల్లించే జివోను అనుసరించి భూములు కోల్పోయిన వారికి ప్రత్యామ్నాయ భృతి కింద భూమి స్వాధీనం చేసుకున్న రోజు నుంచి ప్రతి నెల రూ.3 వేలను ఏడాది పాటు అందజేయడం, ప్రతి రైతుకు రూ.50 వేలు తమ కుటుంబాలు, పశువులను రవాణా చేసేందుకు అయ్యే ఖర్చు కింద మంజూరు చేస్తారని జివోలోని వివరాలను ఎజి కోర్టుకు తెలిపారు.