తెలంగాణ

డ్రైవర్ ఎంపవర్‌మెంట్ ప్రోగ్రామ్ ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 15: రాష్ట్రంలో మైనార్టీ వర్గం డ్రైవర్లకు శిక్షణ ఇచ్చి వారిని ఆదుకునే దిశగా రాష్ట్ర మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ నిర్ణయం తీసుకుంది. ‘డ్రైవర్ ఎంపవర్‌మెంట్ ప్రోగ్రాం’ పేరుతో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు ఆ సంస్థ విసి, ఎండి ఒక ప్రకటనలో తెలిపారు. మారుతి మోటార్, ఉబర్ క్యాబ్ సర్వీస్ సంస్థల సహకారంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. మారుతి డ్రైవింగ్ స్కూల్ ద్వారా శిక్షణ, ఉత్తమ డ్రైవింగ్‌లో మెళుకువలు నేర్పించి, తద్వారా ఉబర్ సంస్థలో ఉపాధి కల్పించడం జరుగుతుందని తెలిపారు. అంతే కాకుండా మైనార్టీ ఆర్థిక సంస్థ ద్వారా వాహనాలు కొనుగోలు చేసుకునేందుకు ఆర్థిక సహాయాన్ని కూడా అందజేస్తామని తెలిపారు. దరఖాస్తు చేసుకునే వారు కనీసం 8వ తరగతి పాసై ఉండాలి, అయితే 10వ తరగతి పాసైనా, లేదా తప్పిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతందని సంస్థ తెలిపింది. తేలికపాటి వాహనాలు నడిపే లైసెన్సు కలిగి ఉండి, వయస్సు 21 దాటి, 40 ఏళ్లు నిండకుండా ఉండాలి, కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాల వారైతే ఏడాదికి రూ.1,50,000, పట్టణాల్లోని వారైతే రూ.2 లక్షలు దాటకుండా ఉండాలి. ఆన్‌లైన్ ద్వారా ఈ నెల 28లోగా దరఖాస్తు చేసుకోవాలని, ఆఫ్‌లైన్ పద్దతిలో దరఖాస్తులు స్వీకరించబడవని తెలిపింది.