తెలంగాణ

ఇంజనీరింగ్ పేపర్ల మూల్యాంకనంలో లోపాలపై జెఎన్‌టియుహెచ్ రెక్టార్ నాయకత్వంలో కమిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 15: జెఎన్‌టియు హైదరాబాద్‌లో ఇంజనీరింగ్ విద్యార్థుల ఉత్తీర్ణత రోజురోజుకూ తగ్గి 22 శాతానికి పడిపోవడంపై విద్యార్ధులు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో యూనివర్శిటీ రెక్టార్ ప్రొఫెసర్ ఎన్ వి రమణారావు అధ్యక్షతన ఒక కమిటీని నియమించారు. జెఎన్‌టియు అమలు చేస్తున్న మూల్యాంకన పద్ధతులపై విద్యార్ధులు బుధవారం నాడు మరో మారు అడ్మినిస్ట్రేటివ్ భవనం ముందు ధర్నా చేసి వైస్ ఛాన్సలర్ డాక్టర్ వేణుగోపాల్‌రెడ్డికి వినతిపత్రం అందించారు. అర్హులైన, అనుభవజ్ఞులైన అధ్యాపకులతో మాత్రమే సమాధాన పత్రాలను దిద్దించాలని ఎబివిపి నేతలు డిమాండ్ చేశారు. దీంతో ఎబివిపి నేతలను వైస్ చాన్సలర్ పిలిపించుకుని మాట్లాడారు. విద్యార్ధుల డిమాండ్లను కమిటీ దృష్టికి తీసుకువెళ్లాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా ఎబివిపి గ్రేటర్ కార్యదర్శి జవ్వాది దిలీప్ మాట్లాడుతూ వేలాది మంది విద్యార్ధులు ఇటీవల ప్రకటించిన ఫలితాల్లో ఫెయిల్ అయ్యారని పేర్కొన్నారు. కనీసం ఐదేళ్ల బోధనానుభవం ఉన్న వారినే మూల్యాంకనంలో ఉపయోగించాలని, ఏ సబ్జెక్టును బోధిస్తున్నారో అదే సబ్జెక్టును వారికి అప్పగించాలని విద్యార్ధులు పేర్కొన్నారు. అలాగే సమాధాన పత్రాల జిరాక్స్ కాపీలను కూడా ఇవ్వాలని ఒక సారి మూల్యాంకనం అయిన తర్వాత మరో మారు నిపుణులతో పరిశీలన జరిపించాలని అన్నారు. దీనిపై విసి సానుకూలంగా స్పందించారు.
ఇంటర్ పరీక్ష వాయిదా
శాసనమండలి ఎన్నికల దృష్ట్యా మార్చి 9వ తేదీన జరగాల్సిన పరీక్షలను మార్చి 19వ తేదీకి వాయిదా వేసినట్టు ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు. 9వ తేదీన సెకండియర్ మాథ్స్, జువాలజీ, హిస్టరీ , వొకేషనల్ పరీక్షలు జరగాల్సి ఉంది. దానిని 19వ తేదీన నిర్వహిస్తారు.