తెలంగాణ

హైదరాబాద్‌కు ‘ఖత్’రా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 15: హైదరాబాద్‌లో కొత్త డ్రగ్ ‘ఖత్’ దందా సాగుతోంది. ఇప్పటి వరకు నగరంలో గంజాయి, కొకైన్, చరస్, ఫెమిడ్రోయిన్ వంటి డ్రగ్స్ పట్టుబడుతుండగా, తాజాగా కొత్త డ్రగ్ హైదరాబాద్‌ను ‘ఖత్’రాలో పడేయనుంది. ఖత్ (కాడలు) డ్రగ్ సోమాలియా నుంచి నగరానికి సరఫరా అవుతోంది. సంపన్న వర్గాలు నివాసం ఉండే ప్రాంతాల్లో మకాం వేసిన అంతర్జాతీయ ముఠా గుట్టుగా నిషిద్ధ మాదకద్రవ్యాలను సరఫరా చేస్తున్నట్టు సమాచారం. ఇటీవల టాస్క్ఫోర్స్ పోలీసులకు పట్టుబడిన నిందితులు ఇచ్చిన సమాచారంతో కొత్త డ్రగ్ వ్యవహారం బయటకు వచ్చినట్టు తెలుస్తోంది. విదేశాల నుంచి ముంబయికి, అటు నుంచి బస్సుల్లో హైదరాబాద్‌కు చేరుతున్న డ్రగ్స్ ఏజెంట్లు ఇక్కడున్న కొరియర్స్‌కు సరుకు అందిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారమంతా ఆన్‌లైన్, వాట్సాప్ మెసెంజర్ ద్వారా జరుగుతున్నట్టు గుర్తించారు. ఈ కొత్త డ్రగ్ ‘ఖత్’ కీలక సూత్రధారి పట్టుబడితే భారీ డ్రగ్స్ రాకెట్ వెలుగుచూస్తుందని ఓ సీనియర్ పోలీస్ అధికారి అభిప్రాయపడ్డారు. టాస్క్ఫోర్స్ పోలీసులు ఆన్‌లైన్‌లో సాగుతున్న ఈ దందాను పసిగట్టే పనిలో ఉన్నట్టు సమాచారం. సోమాలియా నుంచి అక్రమంగా ఖత్ ఆకులను తీసుకువచ్చి హైదరాబాద్‌లో విక్రయిస్తున్న ఇద్దరు విదేశీయుల్ని నగర పోలీసులు నిరుడు మే నెలలో అరెస్టు చేశారు. ఈ ముఠాకు ఆ మత్తు ఆకులు ఎక్కడ నుంచి..ఎలా వస్తున్నాయన్న దానిపై ఇప్పటి వరకు స్పష్టత లేదు. అయితే సోమాలియా ముఠాలు ఖత్‌ను సరఫరా చేస్తున్న విధానాన్ని ఇటీవల కేరళ కస్టమ్స్ అధికారులు కనిపెట్టారు. కాగా హైదరాబాద్‌లో పట్టుబడిన ముఠాకు ఇలాగే సరఫరా చేసినట్టు టాస్క్ఫోర్స్ పోలీసులు ప్రాథమిక ఆధారాలు సేకరించారు. బ్రౌన్ షుగర్, కొకైన్, మొథకోలెన్ వంటి డ్రగ్స్ ఉన్నత వర్గాలు వాడేవి. వీటన్నిటిని మించిన కొత్త డ్రగ్ ‘ఖత్’ (కాడలు) కూడా సంపన్నులకే సరఫరా అవుతున్నట్టు సమాచారం. దీని విలువ ఒక గ్రాము రూ. 3వేల నుంచి 5వేల వరకు ఉంటుందని తెలిసింది. నిరుడు పట్టుబడిన సోమాలియాకు చెందిన మహమూద్ జమాక్, ఫదీ మహమూద్, మైకేల్ జర్నిలను విచారించగా ఈ మాదకద్రవ్యం గుట్టు బయటకు వచ్చినట్టు తెలుస్తోంది. సోమాలియా, సౌతాఫ్రికా, కువైట్‌కు చెందిన డ్రగ్ స్మగ్లర్లు కొందరిని విద్య, వ్యాపారం, విహారం, శరణార్థి ముసుగులో హైదరాబాద్‌లో తిష్టవేయించి ఈ దందాను కొనసాగిస్తున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు పట్టుబడిన మత్తుపదార్థాలు సరఫరాచేసే ఏజెంట్లు ఖత్ డ్రగ్‌పై నోరువిప్పలేదని, ఇటీవలే ఇది భారీ డ్రగ్ అని తెలస్తున్నట్టు ఓ సీనియర్ టాస్క్ఫోర్స్ అధికారి తెలిపారు. వాసన రాకుండా ఉండడమే ఈ డ్రగ్ ప్రత్యేకతని, ఇది ఆకులు, కాడల రూపంలో ఉంటుందని తెలిపారు. దీనిని నమిలినా..సిగరెట్లలాగా పీల్చినా.. లేదా ద్రవపదార్థంగా మార్చి తాగినా కనీసం ఏడు గంటల పాటు ఎలాంటి వాసన రాకుండా మత్తులోనే ఉండొచ్చని పోలీసులు గుర్తించారు. కేరళలో బయటపడిన వ్యవహారంతో హైదరాబాద్‌లో ఈ దందా కొనసాగుతున్నట్టు టాస్క్ఫోర్స్ గుర్తించింది. త్వరలోనే ఖత్ డ్రగ్ దందా గుట్టును రట్టు చేస్తామని, ఆ దిశగా దర్యాప్తు కొనసాగుతోందని ఓ అధికారి తెలిపారు.

చిత్రం..కాడల రూపంలో ఉన్న ఖత్ మాదకద్రవ్యం