తెలంగాణ

తెలంగాణలో మరో నాలుగు డిఐజి రేంజ్‌లు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 15: తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు దృష్ట్యా పోలీస్ శాఖలో మరో నాలుగు కొత్త డిఐజి రేంజ్‌లు ఏర్పాటు చేయడం ని అవసరమని ప్రభుత్వం యోచిస్తోంది. కొత్త రేంజ్‌ల ఏర్పాటు చేయాలని పోలీస్ శాఖ నుంచి ప్రతిపాదన మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్, కరీంనగర్‌లలో డిఐజి రేంజ్‌లు ఉన్నాయి. కొత్తగా జిల్లాలు పెరగడంతో మరిన్ని రేంజ్‌లు ఏర్పాటు చేస్తే పాలన సులభతరంగా ఉంటుందని భావిస్తున్నారు. కొత్తగా మంచిర్యాల, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, కొత్తగూడెంలను డిఐజి రేంజ్‌లు ఏర్పాటు చేయాలని పోలీస్ శాఖ ప్రతిపాదనలు చేసినట్టు విశ్వసనీయ సమాచారం. గతంలో ఒక్కోరేంజ్ కింద రెండు, మూడు జిల్లాల పోలీస్ యూనిట్లు ఉండేవి. కొత్త జిల్లాల ఏర్పాటుతో ఒక్కో రేంజ్ కింద ఏడు, ఎనిమిది జిల్లాలు వచ్చాయి. ఒక్కో రేంజ్ కింద నాలుగైదు జిలాలలు వచ్చేవిధంగా కార్యాచరణ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇదిలావుండగా ప్రస్తుతం ఉన్న నాలుగు రేంజ్‌లలో ఇద్దరు డిఐజిలు మాత్రమే విధుల్లో ఉన్నారు. కొత్త రేంజ్‌లు వస్తే సీనియర్ ఎస్పీలకు బాధ్యత అప్పగించాలని భావిస్తున్నట్టు ఓ పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు. రాష్ట్రంలో జోన్ల వ్యవస్థను ఎత్తివేయడమా? లేదా మరికొన్ని జోన్లు ఏర్పాటు చేయడమా? అన్న దానిని బట్టి తుది ప్రతిపాదనలు ఉంటున్నట్టు తెలుస్తోంది. జోన్ల వ్యవస్థ పునర్‌వ్యవస్థీకరణ చేస్తే పోలీస్ శాఖలో మరో రెండు జోన్లు కూడా ఏర్పాటయ్యే అవకాశం లేకపోలేదు. త్వరలో పదోన్నతి పొందే ఇద్దరు డిఐజిలతోపాటు కేంద్ర సర్వీసుల్లో ఉన్న డిఐజిలను సైతం రాష్ట్రానికి తీసుకువచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం.