తెలంగాణ

నీటి ప్రాజెక్టుల పేరిట దోపిడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 15: నీటి ప్రాజెక్టుల నిర్మాణం పేరిట ప్రజాధనం దోపిడీకి గురవుతున్నదని వామపక్షాలు, విప్లవ రచయితల సంఘం, తెలంగాణ జల సాధన సమితి, తదితర ప్రజా సంఘాలు మండిపడ్డాయి. బుధవారం మేధావులు, వివిధ ప్రజా సంఘాల నేతలు మఖ్దూం భవన్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా టి.జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండ రామ్ ప్రసంగిస్తూ కాళేశ్వరం కంటే తుమ్మిడిహెట్టే అన్ని విధాల మేలని అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి అన్ని విధాలా మేలు చేసే ప్రాణహిత తుమ్మిడిహెట్టి ప్రధాన ప్రాజెక్టును వదిలి మేడిగడ్డ-కాళేశ్వరంగా మార్చి 40 వేల కోట్లకు పైగా పెంచారని ఆయన విమర్శించారు. నీళ్ళు ఉండి ఎక్కువ గ్రావిటీతో 38,500 కోట్ల రూపాయల వ్యయం అయ్యే తుమ్మిడిహెట్టిని చేపట్టకపోవడంలోని ఆంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు. గ్రావిటీ ద్వారా తుమ్మిడిహెట్టి వద్ద 50-60 టిఎంసిల నీటిని నిలువ చేసే అవకాశాన్ని అసలే పరిశీలించకుండా, 557 మీటర్ల ఎత్తులో మల్లన్న సాగర్‌ను 50 టిఎంసిలకు పెంచడం అర్థరహితమని అన్నారు. సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డిపిఆర్) లేకుండానే పనులు ఎందుకు చేపడుతున్నారని ప్రొఫెసర్ కోదండరామ్ ప్రశ్నించారు.
సిపిఐ రాష్ట్ర సమితి కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ప్రసంగిస్తూ బహుళ దశలలో పంపింగ్, అనేక టనె్నల్స్, కాలువలు, రిజర్వాయర్లు, అత్యంత సంక్లిష్ట రవాణా 200 టిఎంసిల నీటిని వంద నుంచి 624 మీటర్ల ఎత్తుకు తీసుకెళ్లే కాళేశ్వరం లాంటి భారీ ఎత్తిపోతల పథకం దేశంలోనే కాదు ఎక్కడా లేదని విమర్శించారు. తెలంగాణ జల సాధన సమితి నాయకుడు నైనాల గోవర్ధన్ ప్రసంగిస్తూ సిడబ్ల్యుసి 50 సంవత్సరాల నీటి లెక్కల ప్రకారం తుమ్మిడిహెట్టి నుంచి 108 రోజులలో 200 టిఎంసిల నీటిని తరలించవచ్చని, పంపింగ్ సామర్థ్యాన్ని 3 టిఎంసిలకు పెంచితే 288 టిఎంసిలు తరలించవచ్చని అన్నారు. ఇంకా ఈ సమావేశంలో జస్టిస్ చంద్రకుమార్, వివిధ ప్రజా సంఘాలు, వామపక్షాల నాయకులు కె. సాంబశివరావు, డివి కృష్ణ, బూతం వీరయ్య, ప్రొఫెసర్ వినాయక్ రెడ్డి, విశ్రాంత ఇంజనీర్ ఇన్ చీఫ్ భాగ్యతా రెడ్డి, విద్యుత్తు జెఎసి అధ్యక్షుడు కె. రఘు, తెలంగాణ ఇంజనీర్ల ఫోరం నాయకుడు దొంతు లక్ష్మీనారాయణ తదితరులు ప్రసంగించారు. వీరంతా తమ ప్రసంగాల్లో కాళేశ్వరం కంటే తుమ్మిడిహెట్టే అత్యంత అనువైనదని అభిప్రాయపడ్డారు. కాళేశ్వరం నుంచి పాత ఆదిలాబాద్‌లోని నిర్మల్, నిజామాబాద్, నల్లగొండ జిల్లాలకు నీరు అందించడం అంత తేలికైన అంశమేమీ కాదని అన్నారు. కేవలం ఒక్క సంవత్సరం పంపింగ్ ఖర్చు 7903 కోట్ల నుంచి 13,172 కోట్లు అవుతుందని వారు తెలిపారు. ఒక్క ఎకరాకు నీళ్ళు అందించడానికి అయ్యే మూలధన (కాపిటల్) ఖర్చు 5 లక్షల నుంచి 10 లక్షలు ఉంటుందని అన్నారు. మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి నీటిని ఎత్తిపోసేందుకు విద్యుత్తు వ్యయం 1253 కోట్ల రూపాయలు అవుతుందని, ప్రతి ఎకరాకు 43,449 రూపాయల నుంచి 72,416 కరెంటు ఖర్చు అవుతుందని వారు తెలిపారు. మల్లన్న సాగర్ ఆయకట్టు కింద ప్రతి ఎకరాకు కరెంటు ఖర్చు 50,459 వేల రూపాయల నుంచి 84,148వేల రూపాయలు అవుతుందని వారన్నారు.