తెలంగాణ

బ్రాహ్మణ సంక్షేమ నిధికి వంద కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: బ్రాహ్మణుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు వచ్చే ఏడాది బడ్జెట్‌లో వంద కోట్ల రూపాయలను కేటాయించారని, అన్ని వర్గాల సంక్షేమానికి కేటాయింపులు అద్భుతంగా ఉన్నాయని టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే గాదారి కిషోర్ కుమార్ అన్నారు. దేశాన్ని 14 మంది ప్రధానులు పరిపాలించారని, ఇందులో 8 మంది బ్రాహ్మణులేనని చెప్పారు. కాని ఇంతవరకు ఎప్పుడూ లేని విధంగా బ్రాహ్మణుల సంక్షేమానికి కెసిఆర్ భారీ నిధులు కేటాయించాలనే నిర్ణయం తీసుకోవడాన్ని ఆయన ప్రశంసించారు.
శనివారం అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బంగారు తెలంగాణకు అద్భుతమైన పునాదులు నిర్మించిన ఘనత కెసిఆర్‌దేనన్నారు. రామరాజ్యమంటే ఏమిటో చూడలేదని, 14 ఏళ్ల అజ్ఞాత వాసం తర్వాత శ్రీరామచంద్రుడు అయోధ్యకు వస్తే పట్ట్భాషేకం జరిగిందన్నారు. అలాగే తెలంగాణ సాధనకు 14 ఏళ్ల పోరాట చేసి ఎన్నో కష్టనష్టాలకు ఓర్చుకున్నారని, కెసిఆర్ రామరాజ్యం తరహాలో మంచి పాలనను అందిస్తున్నారన్నారు.
గత 60 ఏళ్లలో తెలంగాణ విధ్వంసం జరిగిందని, ఇప్పుడిప్పుడే లేచి కూర్చుంటోందన్నారు. మిగులు హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్ విలీనం జరిగిన సమయంలో మిగులు బడ్జెట్ ఉండేదని, మళ్లీ 60 ఏళ్ల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మిగులు బడ్జెట్ సాధించామన్నారు. సమైక్యపాలనలో తెలంగాణ ప్రాంత నిధులను ఆంధ్ర ప్రాంత అభివృద్ధికి ఖర్చుపెట్టారన్నారు. డబుల్‌బెడ్‌రూం ఇండ్లు, కోతలు లేకుండా విద్యుత్ సరఫరా, 91 వేల కోట్లతో విద్యుత్ ప్రాజెక్టు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలు కెసిఆర్ వల్లనే విజయవంతంగా అమలవుతున్నాయన్నారు.
ప్రణాళిక రంగంలో 67 వేల కోట్లు, ప్రణాళికేతర రంగంలో 62 వేల కోట్లు కేటాయించడం గొప్ప విషయమన్నారు. దేశం మొత్తం మీద పాండిచ్చేరి, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లోనే ప్రణాళికేతర కంటే, ప్రణాళిక రంగానికి నిధులు ఎక్కువ కేటాయించినట్లు రికార్డులు చెబుతున్నాయన్నారు. ప్రస్తుతం దేశం మొత్తం మీద గుజరాత్ రాష్ట్రంతో సమానంగా తెలంగాణ ఈ కేటగిరీలో చోటు దక్కించుకుందన్నారు.