తెలంగాణ

యుటిఎఫ్ అధికార అభ్యర్థిగా మాణిక్‌రెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 16: శాసనమండలికి జరుగుతున్న ఎన్నికల్లో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ నియోజకవర్గం ఉపాధ్యాయుల స్థానానికి యుటిఎఫ్ తన అధికార అభ్యర్ధిని ప్రకటించింది. పాపన్నగారి మాణిక్‌రెడ్డి అధికార అభ్యర్థిగా ఈ నెల 17వ తేదీ ఉదయం 11 గంటలకు తన నామినేషన్ దాఖలు చేస్తారని యుటిఎఫ్ ప్రధానకార్యదర్శి చావా రవి తెలిపారు. ఈ సందర్భంగా ఉదయం యుటిఎఫ్ కార్యాలయం నుండి పెద్ద ప్రదర్శన నిర్వహిస్తామని అధ్యక్షుడు ఎన్ నర్సిరెడ్డి, మహిళా కమిటీ సభ్యురాలు బి కల్పన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీలు చుక్కా రామయ్య, ప్రొఫెసర్ కె నాగేశ్వరరావు తదితరులు పాల్గొంటారు.
కెసిఆర్‌కు అభినందనలు
ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావును అభినందించేందుకు 1998 డిఎస్సీ అభ్యర్థులు అంతా సిఎం క్యాంప్ కార్యాలయం వద్ద శుక్రవారం నాడు సమావేశం అవుతున్నట్టు సంఘం నేత బి చంద్రశేఖరరెడ్డి తెలిపారు. ఈ సమావేశానికి ఎంఎల్‌ఎ శ్రీనివాస్‌గౌడ్ హాజరవుతారని ఆయన చెప్పారు.