తెలంగాణ

తెలంగాణకు శాపంగా టిఆర్‌ఎస్ పాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 16: దేశంలో ప్రతి పౌరుడు అవినీతిపై పోరాటం చేయాల్సి ఉందని బిజెపి సీనియర్ నేత డాక్టర్ నాగం జనార్ధనరెడ్డి పేర్కొన్నారు. గురువారం నాడు ఆయన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడుతూ అవినీతికి బంద్ అని సిఎం అంటున్నా, అడుగడుగునా అవినీతి జరుగుతోందని, కాంట్రాక్టర్లే ప్రభుత్వాన్ని నడుపుతున్నారని, ప్రాజెక్టుల అంచనాలు కూడా వారే తయారుచేస్తున్నారని నాగం ఆరోపించారు. సివిసి నుండి ఎస్‌విసి వరకూ అందరికీ స్పష్టమైన ఆధారాలతో కెసిఆర్, టిఆర్‌ఎస్ అవినీతిపై డాక్యుమెంట్లు ఇచ్చానని అన్నా రు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నీటిపారుదల ప్రాజెక్టు అని, 12లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామని చెప్పారని, కాంట్రాక్టర్లను కాపాడేందుకు నేడు దానిని తాగునీటి ప్రాజెక్టు అని ప్రభుత్వం చెబుతోందని, హైకోర్టులో ఈ మేరకు ఒక అఫిడవిట్ ఇచ్చిందని, ఇంతకంటే దేశాన్ని మోసం చేయడం ఇంకేముంటుందని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలు అందర్నీ ఈ ప్రభుత్వం మోసం చేస్తోందని ఆరోపించారు. తాను ప్రభుత్వ అవినీతికి అడ్డం పడుతున్నా కానీ, ప్రాజెక్టులకు అడ్డం పడటం లేదని నాగం పేర్కొన్నారు. శశికళ జైలులో కూర్చున్నట్టే కెసిఆర్ , హరీష్ జైలుకు పోయే రోజు దగ్గరపడిందని అన్నారు. మిషన్ భగీరథలో 20 నుండి 50 శాతం వరకూ వివిధ పనులకు అవినీతి జరుగుతోందని, నిరూపించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు. 1500 కోట్లతో పూర్తయ్యే పాలమూరు ప్రాజెక్టును 7వేల కోట్లకు పెంచిన ఘనత ఈ ప్రభుత్వానిదేనని అన్నారు. టిఆర్‌ఎస్ పాలన తెలంగాణ ప్రజల పాలిట శాపంగా మారిందని ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారని ఆరోపించారు. అవినీతికి పాల్పడుతున్న నేతల వ్యవహారాలపై వెంటనే కోర్టులు జోక్యం చేసుకుని సకాలంలో తీర్పు చెప్పాలని అన్నారు. రాజకీయాలను ప్రక్షాళన చేయాల్సి ఉందని నాగం అన్నారు. ముఖ్యమంత్రి అవినీతిని బయటపెట్టి, నిరూపించి వారి స్థానం ఎక్కడో తాను చూపిస్తానని నాగం పేర్కొన్నారు. విజిలెన్స్ ఎన్‌ఫోర్సుమెంట్ అధికారులకు, సిబిఐ, సివిసి, స్టేట్ విజిలెన్స్ కమిషన్‌కు కూడా తాను డాక్యుమెంట్లు ఇచ్చానని తెలిపారు. ఒక నాడు రాజకీయాల్లోకి రావాలంటే ప్రజాసేవతో వచ్చేవారని, కాని నేడు పరిస్థితి మారిందని, కాంట్రాక్టర్లు, వ్యాపారులు, అడ్డగోలుగా డబ్బును ఆర్జించి సాయంత్రానికి డబ్బును సూటు కేసుల్లో నింపుకుని వెళ్లి రాజకీయాల్లోకి వస్తున్నారని ఆరోపించారు.