తెలంగాణ

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌దే అధికారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వలిగొండ, ఫిబ్రవరి 16: రాబోయే 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే అధికారమని తాజాగా నిర్వహించిన సర్వేలో వెల్లడైందని, ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎన్నికలు జరిగినా తమ పార్టీకి 70 సీట్లు రావడం ఖాయమని పిసిసి ఛీప్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
గురువారం నల్లగొండ జిల్లా వలిగొండ మండల కేంద్రంలో ఒక ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన అనంతరం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాజాగా నిర్వహించిన సర్వేలో కాంగ్రెస్ పార్టీ రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి రావడం ఖాయమని, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అన్ని ఎంపి, ఎమ్మెల్యే స్థానాలను తమ పార్టీ హస్తగతం చేసుకుంటుందన్నారు. బీబీనగర్‌లోని నిమ్స్‌లోనే ఎయిమ్స్‌ను పెట్టాలని, ప్రస్తుతం ఉన్న స్థలానికి మరింత స్థలాన్ని చేర్చి ఈ ప్రాంత ప్రజలకు న్యాయం చేయాలన్నారు. మోదీ, కెసిఆర్ ప్రభుత్వాల పాలనలపై ప్రజలు విసిగెత్తిపోయారని, బిజెపి, టిఆర్‌ఎస్‌లకు రివర్స్ కౌంట్‌డౌన్ ప్రారంభమైందన్నారు. ఈనెల 19 నుండి 28 వరకు 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ‘జన ఆవేదన’ సమ్మేళనం కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. మోదీ విదేశాల్లోని నల్లధనాన్ని తీసుకువచ్చి ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షలు వేస్తామని ప్రగల్భాలు పలికారని, కానీ నేటికీ 15 రూపాయాలు కూడా వేయలేకపోయారని ఆయన ఎద్దేవా చేశారు. ఉపాధి కల్పన విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయన్నారు. తెలంగాణలోని విద్యార్థులు, యువత టిఆర్‌ఎస్ పార్టీకి మద్దతు తెలిపి నేడు చింతిస్తున్నారని వారిలో మార్పు వచ్చిందని, ఇది వచ్చే ఎన్నికల్లో కనిపిస్తుందన్నారు.
ఈ సమావేశంలో డిసిసి అధ్యక్షుడు బూడిద బిక్షమయ్యగౌడ్, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్థన్‌రెడ్డి, మాజీ జడ్పీ చైర్మన్ కసిరెడ్డి నారాయణరెడ్డి పాల్గొన్నారు.