తెలంగాణ

ఉద్యోగాల కోసం ఉద్యమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, ఫిబ్రవరి 16: తెలంగాణ రాష్ట్ర సాధనకు ఉద్యమించిన స్ఫూర్తితోనే ఉద్యోగాల సాధనకు తెలంగాణ విద్యార్థులు, నిరుద్యోగ యువత ఉద్యమించాలని ఈ నెల 22న చలో హైదరాబాద్ ‘నిరుద్యోగ నిరసన ర్యాలీ’లో లక్షలాదిగా కదం తొక్కాలని టి.జెఏసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం పిలుపునిచ్చారు. గురువారం జిల్లా కేంద్రంలో టి.జెఏసి వివిధ ప్రజా సంఘాలు, విద్యార్థి, యువజన సంఘాలతో నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. స్వరాష్ట్రంలో తమకు లక్షలాది ఉద్యోగాలు వస్తాయన్న భరోసాతో ప్రాణాలకు తెగించి త్యాగాలతో ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించిన విద్యార్థి, నిరుద్యోగ యువత ఆశలకు అనుగుణంగా ఉద్యోగ నియామకాలకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో లక్షా 7 వేల ఉద్యోగ ఖాళీలున్నట్లుగా అసెంబ్లీ సాక్షిగా 2014 బడ్జెట్‌లో ప్రకటించిన ప్రభు త్వం తదుపరి మాట మార్చి 60 వేల ఉద్యోగాలే ఉన్నాయందన్నారు. టిఎస్‌పిఎస్‌సి ద్వారా గత 35 నెలల కాలంలో కేవలం 15 వేల ఉద్యోగాల భర్తీకే నోటిఫికేషన్ ఇచ్చారని, ఇందులో ఎన్ని భర్తీ జరిగాయో స్పష్టత లేదన్నారు. సింగరేణి, ఆర్టీసీ, జెన్‌కో, ట్రాన్స్‌కో సంస్థల్లో ఉద్యోగ భర్తీలో ముందడుగు లేదన్నారు. ప్రస్తుతం పదవీ విరమణ వాటితో కలిపి లక్షా 52 వేల ఉద్యోగ ఖాళీలున్నాయన్నారు. ఎన్నికల్లో ఇంటికో ఉద్యోగంతో లక్ష ఉద్యోగాలు ఇస్తామంటూ చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు ఈ అంశానికి ప్రాధాన్యతనివ్వకపోవడంతో విద్యార్థులు, నిరుద్యోగులు తీవ్ర నైరాశ్యానికి గురవుతున్నారన్నారు. డిఎస్సీ సైతం ప్రకటించడం లేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 12 లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం అహార్నిశలు పుస్తకాలతో కుస్తీలు పడుతూ నోటిఫికేషన్లకై ఎదురుచూస్తున్నారన్నారు. ప్రభుత్వం విద్యార్థి, యువత ఆశలను నెరవేర్చాల్సిన బాధ్యతను నిర్వర్తించేందుకు టి.జెఏసి తన బాధ్యతగా తెలంగాణ సమాజంలో ఈ సమస్యను చర్చకు పెడుతుందన్నారు. ప్రభుత్వంపై ఉద్యోగ ఖాళీల భర్తీకి ఒత్తిడి తెచ్చేందుకు ఈ నెల 22న ‘మన కొలువులు మనకే దక్కాలి’అన్న నినాదంతో రాజధానిలో నిరుద్యోగ నిరసన ర్యాలీ చలో హైదరాబాద్‌ను నిర్వహిస్తున్నామన్నారు. ఈ ర్యాలీలో నిరుద్యోగులు లక్షలాది పాల్గొని విజయవంతం చేసి ప్రభుత్వంపై ఉద్యోగ భర్తీకి ఒత్తిడి పెంచాలన్నారు. ఈ సమావేశంలో టి. జెఏసి నాయకులు ధర్మార్జున్, ప్రభాకర్‌రెడ్డి, సైదులు, పాల్వాయి రవి, చుక్క సైదులు, కేశవ్ పాల్గొన్నారు.

చిత్రం..సమావేశంలో మాట్లాడుతున్న చైర్మన్ కోదండరాం