తెలంగాణ

అప్పుల ఊబిలో రాష్ట్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 17: తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్టమ్రంటూ రోజు రోజుకీ అప్పుల ఊబిలోకి నెడుతున్నారని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావుపై కాంగ్రెస్ నేతలు ధ్వజమెత్తారు. బంగారు తెలంగాణ మాటేమో గానీ అప్పుల తెలంగాణగా మాత్రం మార్చారని ఆందోళన వ్యక్తం చేశారు. టిపిసిసి ఉపాధ్యక్షుడు మల్లు రవి శుక్రవారం గాంధీభవన్‌లో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ గడచిన రెండున్నరేళ్ల పాలనలో లక్షా 20 వేల కోట్ల అప్పులు చేసి ప్రతి మనిషిపై అప్పుల భారాన్ని మోపారని అన్నారు. కాళేశ్వరం , పాలమూరు ఎత్తిపోతల పథకాలు, హౌసింగ్ కార్పొరేషన్, మిషన్ భగీరథ కార్పొరేషన్‌లు ఏర్పాటు చేశారని, వీటన్నింటినీ అప్పుల కోసమే ఏర్పాటు చేసినట్లు స్పష్టమవుతోందని అన్నారు. చేసిన అప్పులకు ఈ ఏడాది 7,700 కోట్లు వడ్డీ కట్టాల్సి వస్తోందని వివరించారు.
ఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల్లో 40 శాతమే ఖర్చు చేశారు
రాష్ట్రంలో ఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల్లో 40 శాతం మాత్రమే ఖర్చు చేసిన ప్రభుత్వం గిరిజనులను నిర్లక్ష్యం చేసిందని శాసనమండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ ఆరోపించారు. దీంతో గిరిజనులు దారుణ పరిస్థితులను ఎదుర్కొంటున్నారని అన్నారు. మాజీ మంత్రి రవీంద్రనాయక్, శాసనసభ్యులు వంశీచంద్‌రెడ్డి, టి.రామమోహన్‌రెడ్డితో కలిసి షబ్బీర్ అలీ శుక్రవారం సిఎల్పీలో విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా గిరిజన జెఎసి ఏప్రిల్ 23న నిజాం కాలేజీ మైదానంలో నిర్వహించ తలపెట్టిన గిరిజన శంఖారావం గోడపత్రికను షబ్బీర్ అలీ ఆవిష్కరించారు. కెసిఆర్ గిరిజనులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదని, కాంగ్రెస్ పార్టీ గిరిజనులకు పూర్తిగా అండగా ఉంటుందని తెలిపారు.