తెలంగాణ

రీజనల్ రింగ్ రోడ్డుకు త్వరలో భూసేకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 17: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి మూడు వేల ఎకరాల భూమి అవసరమని రెవెన్యూ, హెచ్‌ఎండిఏ, మున్సిపల్ శాఖలు గుర్తించాయి. సిద్ధిపేట, యాదాద్రి, రంగారెడ్డి, శంషాబాద్, మెదక్ జిల్లాలను అనుసంధానం చేసే విధంగా 300 కి.మీ రీజనల్ రింగ్ రోడ్డును 200 అడుగుల వెడల్పుకు పరిమితం చేస్తే 1800 ఎకరాలు, 300 అడుగుల వెడల్పుకు పెంచితే 3వేల ఎకరాల భూమిని సేకరించాల్సి వస్తుందని ఈ శాఖలు ప్రభుత్వానికి పంపిన నివేదికలో పేర్కొన్నాయి. ఇందులో చాలా వరకు భూమి ప్రైవేట్ వ్యక్తులది కావడం గమనార్హం. కేంద్రం రీజనల్ రింగ్ రోడ్డుకు అవసరమైన నిధులను దశలవారీగా కేటాయించేందుకు అంగీకరించింది. దీంతో వీలైనంత త్వరగా సమగ్ర నివేదికను రూపొందించే బాధ్యతను హెచ్‌ఎండిఏ, మున్సిపల్ శాఖలు చేపట్టాయి. ఈ ప్రాజెక్టుకు దాదాపు రూ.8 వేల కోట్ల నిధులు అవసరమవుతాయని ప్రాథమిక గుర్తించారు. రోడ్డును 200 అడుగులకు పరిమితం చేస్తే మాత్రం ఆరువేల కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేశారు. ప్రస్తుతం ఉన్న రోడ్డు కేవలం 40 అడుగుల వెడల్పు మాత్రమే ఉంది. ఈ రోడ్డు భువనగిరి, చౌటుప్పల్, ఇబ్రహీంపట్నం, షాద్‌ననగర్, చేవెళ్ల, శంకరపల్లి, నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్, జగదేవ్‌పూర్ తదితర పట్టణాలను కలుపుతుంది.