తెలంగాణ

గిరిజనులకు త్వరలో 12 శాతం రిజర్వేషన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, ఫిబ్రవరి 17: ఉమ్మడి రాష్ట్రంలో బంజారాలను ఏ రోజు కూడా పట్టించుకోలేదని, తెలంగాణ రాష్ట్రంలో సిఎం కెసిఆర్ సారధ్యంలోని ప్రభుత్వం బంజారాలకు పెద్దపీట వేసిందని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. శుక్రవారం లయోలా గార్డెన్‌లో తెలంగాణ గిరిజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా గిరిజన చైతన్యసభలో మాట్లాడారు. త్వరలోనే గిరిజనులకు 12శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు అన్ని చర్యలు చేపట్టామన్నారు. సేవాలాల్ జయంతిని అధికారికంగా నిర్వహించేందుక సిఎం కేసిఆర్ కోటి రూపాయలు కేటాయించారన్నారు. హైద్రాబాద్‌లోని బంజారాలకు 10 ఎకరాల స్థలంలో 10 కోట్ల రూపాయలతో బంజారా భవన్‌ను నిర్మించనున్నట్లు తెలిపారు. సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని ట్యాంక్ బాండ్ పై ఏర్పాటుకోసం చర్యలు చేపడుతామన్నారు. వచ్చే గ్రామ పంచాయతి ఎన్నికల్లోపు తండాలను గ్రామ పంచాయితీలుగా మార్చి ఎన్నికలను నిర్వహించేందుక సిఎం కెసిఆర్ చర్యలు చేపడుతున్నాడన్నారు. కాంగ్రెస్ పాలనలో గిరిజనులు పిల్లలను అమ్ముకునే దుస్థితి ఉండేదని, కాని సిఎం కెసిఆర్ చేపట్టిన సంక్షేమ పథకాల వల్ల ఆ పరిస్థితి లేకుండా పోయిందన్నారు. రాజ్యాంగ బద్దంగా సంక్రమించిన హక్కులను కల్పించి వారి అభ్యున్నతికి టిఆర్‌ఎస్ సర్కార్ కృషిచేస్తుందన్నారు.