తెలంగాణ

జనం నెత్తిన అప్పులు..ఆ కుటుంబానికి ఆస్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 17: రాష్ట్రంలో జరుగుతున్న టిఆర్‌ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న దోపిడీ విధానాల వల్ల రాష్ట్రానికి అప్పులు పెరిగి, కెసిఆర్ కుటుంబానికి ఆస్తులు పెరుగుతున్నాయని టి టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి విమర్శించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 60 ఏళ్లలో 17 మంది ముఖ్యమంత్రులు రూ.60 వేల కోట్ల అప్పులు చేస్తే గడచిన రెండున్నరేళ్ల కాలంలో కెసిఆర్ రాష్ట్ర రుణాన్ని లక్షా 20 వేల కోట్లకు పెంచారని ఆయన వివరించారు. అప్పుల కోసమే కొన్ని కార్పొరేషన్లు సృష్టించి భారీగా అప్పులు చేసి ప్రజల నెత్తిన రుణ భారం మోపారని శుక్రవారం ఒక ప్రకటనలో రేవంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్ని అప్పులు చేసినా, బడ్జెట్‌లో భారీ కేటాయింపులు చేసినా డబుల్‌బెడ్ రూం ఇళ్లను ఏ ఒక్క పేదవాడికీ ఇవ్వలేదని, ఫీజు రియింబర్స్‌మెంట్ బకాయిలు అలాగే ఉన్నాయని తెలిపారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చని కెసిఆర్ అసలు నిధులు ఎంతెంత, దేనికి ఖర్చు చేశారో శే్వతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష నేతలను అభివృద్ధి వ్యతిరేక ముఠాలుగా అభివర్ణిస్తున్న టిఆర్‌ఎస్ నేతలే దోపిడీ దొంగల ముఠాలుగా వ్యవహరిస్తున్నారని రేవంత్ ఘాటుగా విమర్శించారు. ఈ నెల 20న నిర్మల్‌లో ప్రజాపోరు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
కాగా,జనహిత దర్బార్‌లో కెసిఆర్ హామీలు నెరవేర్చకపోతే ఊరూరా ప్రజాదర్బార్‌లు నిర్వహించి కెసిఆర్ సర్కార్‌ను నిలదీస్తామని టిటిడిపి అధికార ప్రతినిధి సతీష్ మాదిగ అన్నారు. ప్రజల వద్దకు వెళ్లి సమస్యలను తెలుసుకుని పరిష్కరించే విధానానికి బదులు ప్రజలనే తన వద్దకు రప్పించుకునే విధంగా కెసిఆర్ చర్యలు గడీడిదొరతనానికి నిదర్శనంగా మారాయని టిడిపి మరో అధికార ప్రతినిధి దుర్గాప్రసాద్ అన్నారు.