తెలంగాణ

ఇంజనీరింగ్ నైపుణ్యానికి ప్రతీక మెట్రో రైలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 17: ఆధునిక సాంకేతికత వేగంగా అందుబాటులోకి వస్తున్న నేటి తరుణంలో హైదరాబాద్ మెట్రోరైలు ప్రాజెక్టు అంతర్జాతీయ ఇంజనీరింగ్ నైపుణ్యానికి అరుదైన ప్రతీకగా హైదరాబాద్ మెట్రోరైలు మేనేజింగ్ డైరెక్టర్ డా.ఎన్వీఎస్.రెడ్డి అభివర్ణించారు. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీ క్యాంపస్‌లో శుక్రవారం ఆయన విద్యార్థులనుద్దేశించి ‘యువతకు అవకాశాలు, సవాళ్లు’ అనే అంశంపై ప్రసంగించారు. హైదరాబాద్ మెట్రోరైలు ప్రాజెక్టు ప్రతిపాదనల స్థాయి నుంచి ఉన్నతమైన, అధునాతన ప్రమాణాలు కల్గిన ఇంజనీరింగ్ వ్యవస్థను ఎంపిక చేసుకునేందుకు అనేక అడ్డంకులను, ఒడిదుడుకులను ఎదుర్కొందని వివరించారు. ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా పబ్లిక్- ప్రైవేటు పార్టనర్‌షిప్(పిపిపి) పద్ధతిలో నిర్మిస్తున్న ఓ ప్రయోగమే హైదరాబాద్ మెట్రోరైలు అని వ్యాఖ్యానించారు. ఎంతో మేథస్సు, చురుకైన ఆలోచనలు, దానికి తగ్గట్లు చక్కటి ముందుచూపుతో చేపట్టిన మెట్రోరైలు ప్రాజెక్టు త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి వచ్చి, వారి స్వప్నం నిజమయ్యే సమయం ఆసన్నమైందని వివరించారు. కారిడార్ 1లోని మియాపూర్ నుంచి సంజీవరెడ్డినగర్ వరకు పదకొండు కిలోమీటర్లు, అలాగే కారిడార్ 3లోని నాగోల్ నుంచి బేగంపేట వరకు 16 కిలోమీటర్ల మెట్రో కారిడార్‌ను ఈ సంవత్సరం మధ్యలో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. కారిడార్ 2లోని ఎంజిబిఎస్ వరకుకారిడార్‌ను వచ్చే సంవత్సరం ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు. నేటికి కూడా మెట్రోరైలు ప్రాజెక్టుపై కొందరికి సందేహాలు, అనేక అపోహాలున్నాయని వివరించారు. మెట్రోరైలు ప్రాజెక్టు అనేది ప్రపంచానికి ఓ ఉదాహరణగా చూపించేందుకు ఎంతో కృషి జరుగుతోందని, ఇందులో భాగంగానే ఆత్యాధునిక సిగ్నలింగ్ వ్యవస్థను సమకూర్చుకోవటంతో పాటు రిమోట్ సహాయంతో రైళ్లను నడిపేందుకు వీలుగా ట్రెయిన్ కంట్రోల్ సిస్టమ్‌ను అనుసంధానం చేస్తూ ఆపరేషన్ కంట్రోల్ సిస్టమ్(ఓసిసి)ని వినియోగించనున్నట్లు, ఇందులో భద్రతకు ఎక్కువ ప్రాధాన్యతను కల్పిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇతర మెట్రోరైలు ప్రాజెక్టులకు హైదరాబాద్ మెట్రోకు ఉన్న వ్యత్యాసాన్ని వివరించారు.

చిత్రం..ఐఎంటిలో మాట్లాడుతున్న మెట్రోరైలు ఎండి ఎన్వీఎస్ రెడ్డి