తెలంగాణ

హామీలు ఏమయ్యాయి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఉద్యమ కాలంలో చెప్పిన హామీలను నెరవేర్చడంలో తెరాస ప్రభుత్వం విఫలమయిందని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. సభను ఇష్టమొచ్చినట్టుగా నిర్వహించుకుంటున్నారని, స్పీకర్ పక్షపాతంతో వ్యవహరిస్తుండటంతో ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా పోతుందని ఆయన దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టులా సభను నడుపుతున్నారని, ప్రతిపక్ష సభ్యులు అడిగిన ఏ ప్రశ్నకూ సమాధానాలివ్వకుండా దాటవేస్తున్నారని విమర్శించారు. ప్రజా సమస్యల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్దిలేదని దుయ్యబట్టారు. జిల్లాకో ఇంజనీరింగ్ కాలేజీ పెడతామని, కులంతర వివాహాలు చేసుకున్న వారికి ప్రోత్సాహకాలు ఇస్తామన్న తెరాస నాయకుల హామీలు ఏమయ్యాయని, వాటర్ గ్రిడ్ వివరాలను సభలో చెప్పడం లేదని నిప్పులు చెరిగారు.
అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేస్తామని ఇప్పటికీ చేయలేదని, ముఖ్యమంత్రి, మంత్రులు సభను తప్పుదోవ పట్టించే విధంగా వ్యవహరిస్తున్నారని, ప్రజాసమస్యలపై ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం లేకుండా చేస్తున్నారని, దీంతో తాము వాకౌట్ చేయబోతుండగా, స్పీకర్ సభను వాయిదా వేసి వెళ్లిపోతున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. హామీలన్నింటిని ఐదేళ్లలో పూర్తిచేస్తామని కెసిఆర్ చెప్పడం విడ్డూరంగా ఉందని టిడిపి ఎమ్మెల్యే సండ్ర అన్నారు. ఈ విషయంపై ప్రతిపక్షాలన్ని ఏకమై ఆయన తీరును ఎండగడతామని హెచ్చరించారు.
వాస్తవానికి దూరంగా బడ్జెట్: వైకాపా
రాష్ట్ర బడ్జెట్ వాస్తవానికి దూరంగా, అవాస్తవానికి దగ్గరగా ఉందని వైకాపా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు విమర్శించారు. పాలకులు కాకిలెక్కలు చూపుతూ ప్రజలను మోసం చేస్తున్నారని, సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని విమర్శించారు.
సమాధానాలు ఇవ్వలేక పారిపోయారు: రాజయ్య
ప్రతిపక్ష సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక అధికార పక్షం సభ నుంచి పారిపోయిందని ఎమ్మెల్యే సున్నం రాజయ్య విమర్శించారు. ప్రజాసమస్యలపై చర్చించకుండా సభను పక్కదారి పట్టిస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కరవు సాయం చేయకుండా ఇబ్బందులుకు గురిచేస్తున్నారని, మహారాష్ట్ర, కర్ణటక రాష్ట్రాల్లో మాదిరిగా తెలంగాణలో కూడా వ్యవసాయ కమిటీలను ఏర్పాటు చేసి రైతులను కాపాడాలని అన్నారు.