తెలంగాణ

కోమటిరెడ్డికి త్రుటిలో తప్పిన ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, ఫిబ్రవరి 17: సిఎల్పీ ఉపనేత, మాజీ మంత్రి, నల్లగొండ శాసనసభ్యుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి శుక్రవారం ఉదయం తృటిలో రోడ్డు ప్రమాదం నుండి తప్పించుకున్నారు. కోర్టు కేసుకు హాజరుకావడం తో పాటు తన నల్లగొండ నియోజకవర్గం పరిధిలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు హైదరాబాద్ నుండి కోమటిరెడ్డి ఆడి కారులో నల్లగొండకు బయలుదేరారు. మార్గమధ్యంలో విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై కొత్తగూడెం వద్ద ట్రాక్టర్ హైవే మీదకు సడన్‌గా దూసుకువచ్చింది. ట్రాక్టర్‌ను తప్పించేందుకు కోమటిరెడ్డి కారు డ్రైవర్ ప్రయత్నించగా అదే సమయంలో మరో లారీ అడ్డుగా వచ్చి కోమటిరెడ్డి కారును వెనుకవైపు పక్క భాగంలో స్వల్పంగా ఢీకొట్టి రాసుకుంటూ వెళ్లింది. పెద్ద ప్రమాదం తప్పిపోవడంతో కారులో ఉన్న కోమటిరెడ్డి, ఇద్దరు గన్‌మెన్లు, డ్రైవర్ ఊపిరిపీల్చుకుని తేరుకున్నాకా అదే కారులో నల్లగొండకు చేరుకున్నారు. అనంతరం కోమటిరెడ్డి నల్లగొండ కోర్టులో హాజరయ్యా రు. ఆ తర్వాత పట్టణంలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.