తెలంగాణ

కన్నుల పండువగా సిరిమానోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోస్గి, ఫిబ్రవరి 17: మహబూబ్‌నగర్ జిల్లాలో కోరిన కోరికలు తీర్చే కొంగుబంగారంగా ఖ్యాతిగాంచిన పోలేపల్లి రేణుకా ఎల్లమ్మ దేవత జాతర బ్రహ్మోత్సవాల సందర్భంగా లక్షలాదిగా తరలివచ్చిన భక్తుల రాకతో మహబూబ్‌నగర్‌లోని పోలేపల్లి జనసంద్రమైంది. ఆలయం నలుదిక్కుల ఎటుచూసిన ఇసుకేస్తే రాలనంత భక్తజనసందోహం. జాతర బ్రహ్మోత్సవాల్లో అతిముఖ్య ఘట్టమైన షిడే ఉత్సవాన్ని తిలకించేందుకు తెలంగాణ నుండే కాకుండా మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల నుండి భక్తులు లక్షలాదిగా తరలిరావడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసింది. శుక్రవారం వెకువజామునే మహిళలు బోనాలతో మొక్కులు సమర్పించేందుకు బారులు తిరారు. ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన భక్తులు సైతం అమ్మవారికి తమ కోరికలు తీర్చినందుకు ముడుపులు కట్టడంతో పాటు పంచన కోడిపుంజుతో పాటు నెత్తిన బోనంతో అమ్మవారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ తమ మొక్కులను చెల్లించుకున్నారు. మధ్యాహ్నం నుండి అమ్మవారి షిడేను పూలతో అందంగా ముస్తాబు చేశారు. గురువారం రాత్రి పోలేపల్లి గ్రామం నుండి దేవాలయానికి చేరుకున్న అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని శుక్రవారం సాయంత్రం మంగళవాయిద్యాల మధ్య ఊరేగింపుగా ఎల్లమ్మబావి దగ్గరకు తీసుకువచ్చి మంగళసాన్నం చేయించారు. అనంతరం అక్కడి నుండి శివసత్తుల ఆటపాటలతో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఆలయ ప్రాంగణానికి తీసుకువచ్చారు. షిడేలో ఏర్పాటు చేసిన తొట్టెలలో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించారు. అనంతరం కుంభం పోసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై ప్రధాన ఘట్టమైన సిరిమానోత్సవం ప్రారంభమైంది. షిడే ప్రారంభం కాగానే ఎల్లమ్మ మాతకి జై అంటూ భక్తుల జయజయ ద్వానాలతో మారుమోగింది. పసుపు, కుంకుమల మిశ్రమమైన గవ్వల బండారును అమ్మవారి ఉత్సవ విగ్రహంపై చల్లుతూ ఎల్లమ్మతల్లి తమను చల్లంగా చూడాలంటూ మొక్కుకున్నారు. లక్షలాది మంది భక్తులు అమ్మవారి షిడేను లాగేందుకు పోటీ పడ్డారు. ఆలయం చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేసిన అనంతరం అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని షిడే నుండి తీసుకుని తిరిగి గర్భగుడిలో ఉంచారు. ఆ సమయంలో భక్తులు అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని తాకేందుకు ప్రయత్నించడంతో తొక్కిసలాట జరిగింది. దీంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. ఎట్టకేలకు అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని దేవస్థానం కమిటీ చైర్మన్ రామకృష్ణారెడ్డి, మాజీ చైర్మన్ ముచ్చటి వెంకటేష్‌లు గర్భగుడిలోకి తీసుకెళ్లారు. దింతో ప్రధాన ఘట్టమైన ఎల్లమ్మ బ్రహ్మోత్సవాల్లో బాగంగా సిరిమానోత్సవం ముగిసింది.

చిత్రం..భక్తులకు దర్శనమిస్తున్న పోలెపల్లి రేణుక ఎల్లమ్మ అమ్మవారి సిరిమానోత్సవం