తెలంగాణ

చక్కెర ఇక చేదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం టౌన్, ఫిబ్రవరి 18: తీపిని పంచే పంచదార రానున్న రోజుల్లో చేదుగా మారనుంది. రాయితీతో రేషన్ దుకాణాల ద్వారా ప్రతినెలా తెల్ల రేషన్ కార్డుదారులకు సరఫరా చేసే అరకిలో చక్కెర ఏప్రిల్ 1 నుంచి దూరమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. చక్కెరపై రాష్ట్రానికి ఇస్తున్న రాయితీని 2017-18 ఆర్థిక సంవత్సరం నుంచి నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపుల్లోనూ ఈమేరకు కోత విధించింది. దీంతో చౌక ధరల దుకాణాల్లో పంచదార అమ్మకం నిలిచిపోనుంది. ఆహార భద్రత చట్టంలో దారిద్య్ర రేఖకు దిగువనున్న వినియోగదారులకు అంటూ ప్రత్యేకంగా విభాగం లేకపోవటమే చక్కెరపై రాయితీ ఎత్తివేయడానికి కారణమంటున్నారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో కిలో పంచదార ధర 42 రూపాయలు ఉంది. అదే చౌక ధరల దుకాణాల్లో కిలో రూ. 13.50కి లభిస్తోంది. ఇంతకాలం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ దుకాణాల్లో ఇస్తున్న పంచదారపై రూ. 26.50 రాయితీని భరిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసిన రాయితీని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తే చౌక ధరల దుకాణాల్లో పంచదార యథావిధిగా సరఫరా అవుతుంది. లేనిపక్షంలో ఏప్రిల్ 1 నుంచి అన్ని వర్గాల ప్రజలు బహిరంగ మార్కెట్‌లోనే పంచదార కొనక తప్పదు.