తెలంగాణ

నల్సార్‌లో ఆడిటోరియం ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: నల్సార్ విశ్వవిద్యాలయంలో నూతనంగా నిర్మించిన ఆడిటోరియంను ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు శనివారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా విశ్వ విద్యాలయంలో నల్సార్, ల్యాండెన్ స్వచ్ఛంద సంస్థ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ‘్భమికి సంబంధించిన న్యాయ సేవలు- పేదలు అవసరాలు’ అనే అంశంపై సదస్సును సుప్రీంకోర్టు న్యాయమూర్తి అనిల్ ఆర్ దవే ప్రారంభించారు. స్వాధీనంలో భూమి, చేతిలో పట్టా, రెవెన్యూ రికార్డుల్లో పేరు ఉన్నప్పుడే భూమిపై హక్కు ఉంటుందని జస్టిస్ దవే అన్నారు. భూ చట్టాలు సరళంగా, పేదలకు అర్థమయ్యే స్థానిక భాషలో ఉంటే ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా మాట్లాడుతూ, భూమిని కోల్పోతే తిరిగి తెచ్చుకోవడం కష్టమన్నారు. ప్యారా లీగల్, న్యాయ విద్యార్థులు వ్యక్తుల మధ్య వివాదాలు, రికార్డులలో తప్పులను మొదట అర్థం చేసుకోవాలన్నారు. మరో సుప్రీంకోర్టు న్యాయమూర్తి, జస్టిస్ ఎన్‌వి రమణ మాట్లాడుతూ, ప్రకృతి వైపరీత్యాలకు ఓర్చి రైతు ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధరలేక ఇబ్బందికి గురవుతున్నారని అన్నారు. అందుకే వివిధ పంట బీమా పథకాలపై రైతులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రైతులను సంఘటితపర్చాల్సిన అవసరం ఉందన్నారు.

నల్సార్ యూనివర్సిటీలో ఆడిటోరియాన్ని ప్రారంభిస్తున్న సిఎం కెసిఆర్

వేసవి రద్దీ దృష్ట్యా
52 సువిధ రైళ్లు

హైదరాబాద్, మార్చి 19: రానున్న వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని విశాఖపట్నం- సికింద్రాబాద్- విశాఖపట్నం మధ్య 26 రైళ్లను, విశాఖపట్నం- తిరుపతి- విశాఖపట్నం మధ్య 26 రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. వారానికి ఒకసారి నడిచే ఈ రైళ్లను ప్రయాణికులు వినియోగించుకోవాలని తెలిపింది. విశాఖపట్నంలో నెం.08501 రైలు రాత్రి 11 గంటలకు బయలుదేరి తర్వాత రోజు మధ్యాహ్నం 12 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఏప్రిల్ 5, 12, 19, 26, మే 3, 10, 17, 24, 31 తేదీల్లో, జూన్ 7, 14, 21, 28 తేదీల్లో విశాఖపట్నంలో బయలుదేరుతుంది. తిరుగు ప్రయాణంలో నెం.08502 రైలు ఏప్రిల్ 6, 13, 20, 27 తేదీల్లో, మే 4, 11, 18, 25 తేదీల్లో, జూన్ 1, 8, 15, 22, 29 తేదీల్లో సికింద్రాబాద్ నుంచి సాయంత్రం 4.30 గంటలకు బయలుదేరి తర్వాత రోజు ఉదయం 4.30కి విశాఖపట్నం చేరుకుంటుంది. అలాగే విశాఖపట్నం నుంచి నెం.08573 రైలు ఏప్రిల్ 4, 11, 18, 25, మే 2, 9, 16,23, 30, జూన్ 6, 13, 20, 27 తేదీల్లో రాత్రి 10.55కి బయలుదేరి తర్వాత రోజు మధ్యాహ్నాం 1.15 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో నెం.08574 రైలు తిరుపతి నుంచి ఏప్రిల్ 5, 12, 19, 26, మే 3, 10, 17, 24, 31, జూన్ 7, 14, 21, 28 తేదీల్లో తిరుపతి నుంచి రాత్రి 10.55 గంటలకు బయలుదేరి తర్వాత రోజు మధ్యాహ్నం 1.15 గంటలకు తిరుపతి చేరుకుంటుందని ద.మ.రైల్వే ఒక ప్రకటనలో వెల్లడించింది.

‘గోపినాథ్, గాంధీ
సభ్యత్వాలను రద్దుచేయండి’

హైదరాబాద్, మార్చి 19: తమ పార్టీ తరఫున అసెంబ్లీకి ఎన్నికై టిఆర్‌ఎస్‌లో తాజాగా చేరిన ఎమ్మెల్యేలు మాగంటి గోపినాథ్, అరికెపూడి గాంధీల శాసన సభ్యత్వాలను రద్దు చేయాల్సిందిగా కోరుతూ టిడిపి ఎమ్మెల్యేలు ఎ. రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య స్పీకర్ మధుసూదనా చారిని కోరారు. ఈ మేరకు వారు శనివారం అసెంబ్లీ ఆవరణలోని స్పీకర్ ఛాంబర్‌లో స్పీకర్ మధుసూదనా చారిని కలిసి పిటీషన్ అందజేశారు. దీంతో ఇప్పటి వరకు టిడిపి నుంచి టిఆర్‌ఎస్‌లోకి ఫిరాయించిన వారి సంఖ్య 12కు పెరిగింది.

నక్సల్స్‌తో చర్చించాలి
తెలుగు రాష్ట్రాలకు గద్దర్ సూచన

హైదరాబాద్, మార్చి 19: అడవులను కాపాడుకోవాలంటే నక్సలైట్లతో శాంతి చర్చలు జరిపేందుకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సిద్ధమవ్వాలని, అటవీ ప్రాంతంలో ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పాలని ప్రజా గాయకుడు గద్దర్ సూచించారు. విప్లవ నటుడు, నిర్మాత, దర్శకుడు ఆర్.నారాయణమూర్తి రూపొందించిన ‘దండకారణ్యం’ సినిమాను చూసిన అనంతరం గద్దర్ శనివారం మీడియాతో మాట్లాడారు. ఆదివాసీలు, అడవులపై నారాయణమూర్తి చిత్రీకరించిన సన్నివేశాలు తనను కదిలించాయని, అడవులను సంరక్షించుకోవాలంటే అటవీ ప్రాంతాల్లో శాంతి స్థాపన అనివార్యమని గద్దర్ అన్నారు. పేదల సమస్యలపై నక్సలైట్లు సాగిస్తున్న ఉద్యమాన్ని, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిని విస్మరిస్తున్న ప్రభుత్వాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. నక్సలైట్లతో ప్రభుత్వాలు చర్చలకు సిద్ధమైతే తాను ముందుంటానన్నారు. నక్సలైట్ల సమస్యను సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశంగా గుర్తించాలని ఆయన సూచించారు.