తెలంగాణ

ఫెమినా సౌత్ జోన్ పోటీకి తెలంగాణ యువతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 18: ఎఫ్‌బిబి కలర్స్ ఫెమినా మిస్ ఇండియా 2017 సౌత్ జోన్ పోటీలకు ముగ్గురు తెలంగాణ అమ్మాయిలు ఎంపికయ్యారు. ఈ ఏడాది మరింత మెరుగైన ఏర్పాట్లతో మిస్ ఇండియా 54వ ఎడిషన్ దేశంలోని 30 రాష్ట్రాల్లో ప్రయాణించి 30 మంది రాష్టస్థ్రాయి ప్రతినిధులను ఎంపిక చేసి వారి నుంచి మిస్ ఇండియా కిరీటానికి పోటీ జరుగుతుంది. దీనిలో భాగంగా హైదరాబాద్‌లోని అమీర్‌పేట ఎఫ్‌బిబి, బిగ్‌బజార్‌లో జరిగిన ప్రతిభానే్వషణలో రాష్ట్రం నలుమూలల నుంచి 80 మందికిపైగా పోటీపడ్డారు. వీరిలో ముగ్గురు యువతులను ఎంపిక చేసినట్లు అమీర్‌పేట బిగ్‌బజార్ స్టోర్ మేనేజర్ శిషిర్ త్రిపాఠి తెలిపారు. శ్రేయ కామవరపు, సిమ్రాన్ చౌదరి, స్పటిక సూరపనేనిలు ఎంపికయ్యారని పేర్కొన్నారు. ఈ ముగ్గురు మార్చి 5న బెంగళూరులో జరిగే సౌత్ జోనల్ పోటీల్లో పాల్గొనేందుకు అర్హత సాధించారని తెలిపారు. సౌత్ జోన్‌లో ఎంపికైన ఒకరిని ఫైనల్ పోటీలకు పంపిస్తారని, తద్వారా దేశంలోని 30 రాష్ట్రాల నుంచి ఒక్కొక్కరి చొప్పున మిస్ ఇండియా కిరీటానికి పోటీపడి ఒకరు విజేతగా నిలుస్తారని వివరించారు.