తెలంగాణ

కోమటిరెడ్డి గీత దాటారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 18: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి చేపట్టిన సర్వేను బోగస్ సర్వే అంటూ నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడుతున్నారు. కోమటిరెడ్డిపై పార్టీపరంగా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందేనని నేతలంతా ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. టిపిసిసి ఉపాధ్యక్షుడు మల్లు రవి, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, పిసిసి ప్రధానకార్యదర్శి దాసోజు శ్రవణ్, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ తదితరులు విలేఖరులతో మాట్లాడుతూ కోమట్టిరెడ్డి పార్టీ గీత దాటి మాట్లాడారని, బహిరంగంగా పార్టీ చర్యలను విమర్శించడం క్రమశిక్షణ ఉల్లంఘనే అవుతుందని అన్నారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలు టిఆర్‌ఎస్ నాయకుడు మాట్లాడినట్లు ఉన్నాయని, ఆయన మాటల వెనుక సిఎం కెసిఆర్ ఉండి మాట్లాడించినట్లు ఉందని భావించాల్సి ఉందన్నారు. ఈ విషయంలో అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. కోమటిరెడ్డి వ్యాఖ్యల వల్ల పార్టీ క్యాడర్ మనోధైర్యం దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. కాంగ్రెస్‌లో చీలిక తీసుకువచ్చే విధంగా కెసిఆర్ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోందని ఆరోపించారు. పార్టీలో పదవులు అనుభవించి, కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీకి నష్టం కలిగించేలా కోమటిరెడ్డి మాట్లాడటం దుర్మార్గమని విమర్శించారు.

నెమలి మాంసం
విక్రేతల రిమాండ్
నల్లగొండ రూరల్, ఫిబ్రవరి 18: జాతీయ పక్షి నెమళ్లను వేటాడి, చంపి మాంసాన్ని విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను శనివారం నల్లగొండ అటవీ శాఖ అధికారులు అరెస్టు చేసి కేసు నమోదు చేసి కోర్టు రిమాండ్‌కు తరలించారు. జిల్లా అటవీ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో అటవీ శాఖ రేంజ్ అధికారి అశ్విన్ కేసు వివరాలు వెల్లడించారు. నల్లగొండ మండలంలో అనంతారం గ్రామానికి చెంది కొల్లేటి అశోక్, మేద శంకర్ రెండు నెమళ్లను వేటాడి మాసంగా మార్చారు. అలాగే మరో కుందేలును సైతం వేటాడారు. వాటిని అదే గ్రామంలోనే విక్రయిస్తుండగా నల్లగొండ రూరల్ పోలీసులకు సమాచారం అందడంతో వారిని అదుపులోకి తీసుకుని అటవీ శాఖాధికారులకు అప్పగించారు. అటవీ శాఖ అధికారి అశ్విన్ వారిని అదుపులోకి తీసుకుని వారి నుండి నెమళ్ల మాంసాన్ని, చనిపోయిన కుందేలును స్వాధీనం చేసుకున్నారు.
నిందితులపై వన్యప్రాణి చట్టం మేరకు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్టు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో సెక్షన్ ఆఫీసర్ సిహెచ్.నాగయ్య, బీట్ ఆఫీసర్ మల్లారెడ్డి, ఇతర సిబ్బంది ఉన్నారు.