తెలంగాణ

11న బడ్జెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 19: మార్చి 8 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతాయి. 11వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. సమావేశాలు 18 రోజుల పాటు కొనసాగుతాయి. కొత్త సంవత్సరం తొలి సమావేశాల్లో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. సాధారణంగా బడ్జెట్ సమావేశాలు 16 రోజుల పాటు కచ్చితంగా నిర్వహించాల్సి ఉంటుం ది. ఈసారి గవర్నర్ ప్రసంగం ఉంటుంది కాబట్టి 18 రోజులపాటు నిర్వహిస్తారు. కరెన్సీ నోట్ల రద్దు ప్రభావం బడ్జెట్‌పై కనిపించే అవకాశం ఉంది. గత ఏడాది లక్షా 35వేల కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెట్టారు. సాధారణంగా ద్రవ్యోల్బణానికి తగినట్టు బడ్జెట్ ప్రతి ఏటా కనీసం పది శాతం పెరుగుదల ఉంటుంది. అయితే ఈసారి కరెన్సీ నోట్ల రద్దు వల్ల ఎప్పుడూ లేని విధంగా మూడు నాలుగు శాతానికి మించి పెరుగుదల ఉండే అవకాశం లేదు. లక్షా 40వేల కోట్ల రూపాయల వరకు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. స్టాంప్స్ రిజిస్ట్రేషన్ల ఆదాయం దాదాపు 30శాతం వరకు పడిపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. అయితే మిగిలిన విభాగాల్లో ఆదాయం బాగానే ఉందని అధికారులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ను పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర బడ్జెట్‌కు రూపకల్పన చేస్తున్నారు. ఆయా శాఖలకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను అంచనా వేస్తూ మంత్రులు తమ శాఖల బడ్జెట్‌కు కసరత్తు చేస్తున్నారు. వాస్తవిక అవసరాలకు అనుగుణంగా బడ్జెట్ ఉండాలని మంత్రులకు ముఖ్యమంత్రి కెసిఆర్ సూచించారు.