కృష్ణ

సబ్‌ప్లాన్ రివైజ్డ్ బడ్జెట్ నిధుల వినియోగానికి స్టాండింగ్ కమిటీ గ్రీన్‌సిగ్నల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్): నగరంలోని దళిత వాడల అభివృద్ధితోపాటు వారి ప్రాంతాల్లో వౌళిక సదుపాయాల కల్పనలకు గాను అమలుచేస్తున్న 2015-16 ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ రివైజ్డ్ నిధులకు విఎంసి స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. శనివారం సాయంత్రం కౌన్సిల్ భవనంలోని స్టాండింగ్ కమిటీ హాల్లో నగర మేయర్, కమిటీ చైర్మన్ కోనేరు శ్రీ్ధర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు కీలక అంశాలకు ఆమోదం లభించింది. సబ్‌ప్లాన్‌కు చెందిన 19.74 లక్షల రూపాయల వినియోగానికి ఆమోదం తెలపడమే కాకుండా 14వ డివిజన్ రామలింగేశ్వరనగర్‌లోని గాంధీ కాలనీలో 48లక్షల రూపాయల వ్యయంతో కమ్యూనిటీహాల్ నిర్మాణానికి స్టాండింగ్ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అదేవిధంగా నగరంలోని పలు షాపింగ్ కాంప్లెక్సులలోని షాపులకు, పార్కింగ్ ప్రదేశాలకు కూడా స్టాడింగ్ కమిటీ ఆమోదం తెలపడం విశేషం. 50వ డివిజన్ కేదరేశ్వరపేట మ్యాంగో మార్కెట్ కమ్యూనిటీహాల్, 43వ డివిజన్ దుర్గాపురం, 46వ డివిజన్ సత్యనారాయణపురం లలోని కర్మల భవనాల లీజు ప్రక్రియలకు ఆమోదం లభించింది. అలాగే కెబిఎన్ కాంప్లెక్సు సెల్లార్ పార్కింగ్, ఏలూరురోడ్డు హోటల్ రాజ్‌టవర్స్ పక్కనున్న పెట్రోల్ బంక్ పార్కింగ్ ప్రదేశాల లీజులను ఖరారు చేస్తూ నిర్ణయించారు.

దళిత మహిళా ప్రజాప్రతినిధులను అవమానించిన
రోజాను అరెస్ట్ చేయాలి
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, మార్చి 19: రోజా తన సస్పెన్షన్ కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తమ పరిధిని దాటి వ్యవహరించినట్లుగా కనపడుతుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం జరిగిన విలేఖర్ల సమావేశంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ వర్ల రామయ్య అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ రాజ్యాంగంలోని ఆర్టికల్ 212 ప్రకారం శాసనసభలో జరిగే ప్రొసీడింగ్స్‌పైన విచారణ చేసే అధికారం ఏ కోర్టుకు లేదన్నారు. రోజా ఆంధ్రప్రదేశ్ హైకోర్టును తప్పుదారి పట్టించి తనను ఎందుకు శాసనసభ సస్పెండ్ చేసిందని చెప్పకుండా కోర్టును మభ్యపెట్టి ఈ తప్పుడు ఆర్డర్ తీసుకున్నారన్నారు. చట్టాలను గౌరవించవలసిన శాసన సభ్యురాలైన రోజా శాసనసభలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక దళిత మహిళా శాసనసభ్యురాలిని, దళిత వర్గానికి చెందిన మహిళా మంత్రిని ఘోరంగా కించపరుస్తూ వారి వ్యక్తిగత జీవితాల్లోకి తొంగిచూస్తూ నీచాతినీచమైన పదజాలాన్ని ఉపయోగించి, సభ్య సమాజం సిగ్గుపడే రీతిలో దూషించిన రోజాను ఏడాది కాలం సస్పెండ్ చేసి ఆంధ్రప్రదేశ్ శాసనసభ తన ఔన్నత్యాన్ని కాపాడుకుందన్నారు. ఇప్పటికైనా శాసనసభ స్పీకర్ రోజాపై పోలీసులకు ఫిర్యాదు చేసి ఆమెను వెంటనే కస్టడీలోకి తీసుకుని ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ నిరోధక చట్టం కింద శిక్షించాలన్నారు.

వైసిపి సమావేశం జయప్రదం చేయండి
ఇంద్రకీలాద్రి, మార్చి 19: విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఈ నెల 23వ తేదీన వైసిపి పశ్చిమనియోజకవర్గ కార్యకర్తల విస్తృతస్ధాయి సమావేశాన్ని జయప్రదం చేయాలని వైసిపి నాయకులు ఏకగ్రీవంగా తీర్మానించారు. చిట్టినగర్ శ్రీనగరాల అమ్మవారి దేవస్థానంలో శనివారం ఉదయం వైయస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జ్ లేళ్ళ అప్పిరెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈసమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 23వ తేదీన పశ్చిమ నియోజకవర్గ కార్యకర్తల విస్తుృతస్ధాయి సమావేశాన్ని విజయవంతం చేయవల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందన్నారు.