తెలంగాణ

ప్రభుత్వ అనుమతి వచ్చినా.. రాకున్నా నిరుద్యోగ ర్యాలీ ఆగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉమ్మడి రాష్ట్ర అభివృద్ధిలో
కార్పొరేట్, కాంట్రాక్టర్లకే మేలు
తెలంగాణ అభివృద్ధి ఫలాలు
అన్ని వర్గాలకూ దక్కాలి
రాష్ట్రంలో తీవ్ర రూపం దాల్చిన
నిరుద్యోగ సమస్య
ఉద్యోగ క్యాలెండర్ ప్రకటించి
ఖాళీలను భర్తీ చేయాలి
తెలంగాణ జెఎసి చైర్మన్
కోదండరామ్

సిద్దిపేట, ఫిబ్రవరి 19 : నిరుద్యోగ సమస్య పరిష్కారం

కోసం తెలంగాణ జెఎసి ఆధ్వర్యంలో ఈనెల 22న

హైదరాబాద్‌లో చేపట్టిన నిరుద్యోగ..నిరసన ర్యాలీని

పోలీసులు అనుమతి ఇచ్చినా.. ఇవ్వకున్నా

నిర్వహించి తీరుతామని తెలంగాణ జెఎసి చైర్మన్,

ప్రొఫెసర్ కోదండరామ్ స్పష్టం చేశారు. నిరుద్యోగ

సమస్య పరిష్కారం కోసమే శాంతియుతంగా ర్యాలీని

నిర్వహించనున్నట్లు తెలిపారు. నిరసన ర్యాలీ కోసం

దరఖాస్తు చేసుకున్నామని, సోమవారం అనుమతి

వస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు. ఆదివారం

సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన

విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రం

బాగ్‌లింగంపల్లి నుంచి ఇందిరాపార్కు వరకు

శాంతియుతంగా ర్యాలీని నిర్వహించనున్నట్లు

పేర్కొన్నారు. పోలీసులు సైతం తాము

శాంతియుతంగా నిర్వహించే నిరసన ర్యాలీకి

సంపూర్ణంగా సహకరిస్తారని భావిస్తున్నామన్నారు.

కొత్త రాష్ట్రం ఆవిర్భావించాక తెలంగాణ జెఎసిలో

కొన్ని మార్పులు...చేర్పులు జరిగాయన్నారు. కొత్త

జిల్లాల ఏర్పాటుతో అన్ని జిల్లాల్లో జెఎసి కమిటీలు

నిర్మాణం చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఉమ్మడి

రాష్ట్రంలో అభివృద్ధి అంతా హైదరాబాద్ నగరానికి

పరిమితమైందని, అభివృద్ధి ఫలాలు గ్రామీణ

ప్రాంతాల దరిచేరలేదన్నారు. కార్పొరేట్ శక్తులు,

కాంట్రాక్టర్ల మేలు జరిగేలా గత ప్రభుత్వాలు

వ్వహరించాయన్నాయి. తెలంగాణ ప్రభుత్వం గత

ప్రభుత్వాల బాటలో ప్రయాణిస్తుందన్నారు.

తెలంగాణ అభివృద్ధి ఫలాలు అన్ని వర్గాలకు

అందాలనేది ఉద్యమ ఆకాంక్ష అన్నారు. సామాజిక

న్యాయం ప్రజలకు అందేలా ఉద్యమానికి కంకణ

బద్ధులై పనిచేయాలన్నారు. ఎన్నికలకు, ఎన్నికల

మధ్య ప్రజలు క్రియాశీలకంగా వ్యవహరించాలని

అంబేద్కర్ ఆనాడే చెప్పారన్నారు. ప్రజలను చైతన్యం

చేసేందుకు తెలంగాణ జెఎసి తన వంతు పాత్ర

సమర్థవంతంగా నిర్వహిస్తుందన్నారు. తెలంగాణ

అభివృద్ధి కోసం జెఎసి ప్రజలతో కలసి పనిచేస్తుందని

ఆనాడే చెప్పినట్లు కోదండరామ్ గుర్తుచేశారు.
నిరుద్యోగ సమస్య పరిష్కారమే
ధ్యేయంగా నిరసన ర్యాలీ
తెలంగాణ సర్కార్ వచ్చి రెండున్నర ఏళ్ల్లు

పూర్తయినా నిరుద్యోగ సమస్యను పూర్తిగా

విస్మరించిందని కోదండరామ్ స్పష్టం చేశారు.

రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రత బాగా

పెరిగిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సైతం ఉద్యోగ

నియామకాలు జరగలేదని, ఆ దిశగా తెలంగా ణ

సర్కర్ పనిచేస్తుండటంతో నిరుద్యోగ సమ స్య రోజు,

రోజకూ తీవ్రమవుతుందన్నారు. నీళ్లు, నిధులు,

నియామకాలు తెలంగాణ ఉద్యమ టాగ్‌లైన్

అన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనే

పెద్దసమస్యగా మారిందన్నారు. రాష్ట్రంలో 1.07 లక్షల

ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి

అసెంబ్లీ సాక్షిగా వెల్లడించారని, మరో 30వేల మంది

రిటైర్‌మెం ట్ అయ్యారన్నారు. ప్రభుత్వం కేవలం 15

వేల పోస్టుల మాత్రం భర్తీ చేసిందన్నారు. పబ్లిక్

సెక్టార్‌లో సైతం 50 వేల పోస్టులను భర్తీ చేయాల్సి

ఉండగా 6వేల పోస్టులను మాత్రమే భర్తీ

చేశారన్నారు. పోటీ పరీక్షలకు ప్రభుత్వం క్యాలెండర్

రూపోందించి...ఖాళీలకు అనుగుణంగా నోటిఫికేషన్లు

జారీ చేసి ఉద్యోగ నియామకాలు చేపట్టాలని

సూచించారు.
క్యాలెండర్ వల్ల విద్యార్థుల్లో ఉద్యోగ, ఉపాధికి భరోస

కల్గుతుందన్నారు. భూమి పుత్రులకు ప్రభుత్వం

రిజర్వేషన్లు కల్పించాలన్నారు. సమాన పనికి

సమాన వేతనం చెల్లించాలని సుప్రీంకోర్టు

తీర్పునిచ్చిందని, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్

ఉద్యోగులకు ఫ్రభుత్వ ఉద్యోగులతో సమానంగా

వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ,

ఉపాధి కల్పన ప్రభుత్వం ప్రణాళిక

రూపొందించాలన్నారు. లక్ష్య సాధనకు

కార్యచరణను ప్రకటించాలని కోదందరామ్ స్పష్టం

చేశారు. గురుకల ఉద్యోగాల నోటిఫికేషన్లలో బిఇడి,

డిగ్రీ పూర్తి చేసిన వారందరకి అవకాశం

కల్పించాలన్నారు.
కొత్త పార్టీ ఏర్పాటుపై ఎలాంటి
నిర్ణయం తీసుకోలేదు
తెలంగాణ రాష్ట్రంలో టిజెఎసి ఆధ్వర్యంలో కొత్త పార్టీ

ఏర్పాటుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని టిజెఎసి

చైర్మన్ కోదండరామ్ స్పష్టం చేశారు. ఈనెల 22న

హైదరాబాద్‌లో జరిగే నిరుద్యోగ నిరసన ర్యాలీని

శాంతియుతంగా, సంఘటితంగా చేపడుతున్నట్లు

తెలిపారు. రాజకీయాలకు అతీతంగా ఈ ర్యాలీని

నిర్వహిస్తున్నామన్నారు. నిరుద్యోగులు, యువత

పెద్దఎత్తున కదలిరావాలని పిలుపునిచ్చారు. టిజెఎసి

నేతలు పాపయ్య, అశోక్‌కుమార్, పురుషోత్తం,

బాబురావు, శ్రీనివాస్, దయాసాగర్, రాములు,

పాండు, సాయిబాబ పాల్గొన్నారు.